Suryakumar Yadav: రెండో టీ20... టాస్ గెలిచిన టీమిండియా

India vs South Africa 2nd T20 Suryakumar Yadav Wins Toss
  • భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండో టీ20 మ్యాచ్
  • టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా
  • మొహాలీలోని కొత్త స్టేడియంలో జరుగుతున్న పోరు
  • సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో బరిలోకి దిగిన భారత్
భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న 5 మ్యాచ్ ల టీ20 సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్‌ కోసం రంగం సిద్ధమైంది. చండీగఢ్‌లోని ముల్లన్‌పూర్‌లో ఉన్న మహారాజా యదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో దక్షిణాఫ్రికా జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది.

ఈ రోజు రాత్రి 7:00 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇరు జట్లలోనూ కీలక ఆటగాళ్లు ఉండటంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. ఈ సిరీస్ లో భాగంగా కటక్ లో జరిగిన తొలి టీ20 పోరులో టీమిండియా 101 పరుగుల భారీ తేడాతో సఫారీలను చిత్తు చేయడం తెలిసిందే. ఆ విజయంతో సిరీస్ లో 1-0తో ముందంజ వేసింది.

జట్ల వివరాలు
భారత జట్టు: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్య, శివమ్ దూబే, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.

దక్షిణాఫ్రికా జట్టు:
రీజా హెండ్రిక్స్, క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), ఐడెన్ మార్‌క్రమ్ (కెప్టెన్), డివాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, డొనోవాన్ ఫెరీరా, జార్జ్ లిండే, మార్కో యాన్సెన్, లుథో సిపామ్లా, లుంగి ఎంగిడి, ఒట్నీల్ బార్ట్‌మాన్.
Suryakumar Yadav
India vs South Africa
IND vs SA
2nd T20
Mullanpur Stadium
T20 Series
Cricket
Indian Cricket Team
South Africa Cricket Team
Jasprit Bumrah

More Telugu News