రెండో టీ20... టాస్ గెలిచిన టీమిండియా
- భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండో టీ20 మ్యాచ్
- టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా
- మొహాలీలోని కొత్త స్టేడియంలో జరుగుతున్న పోరు
- సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో బరిలోకి దిగిన భారత్
భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న 5 మ్యాచ్ ల టీ20 సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్ కోసం రంగం సిద్ధమైంది. చండీగఢ్‌లోని ముల్లన్‌పూర్‌లో ఉన్న మహారాజా యదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో దక్షిణాఫ్రికా జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది.
ఈ రోజు రాత్రి 7:00 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇరు జట్లలోనూ కీలక ఆటగాళ్లు ఉండటంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. ఈ సిరీస్ లో భాగంగా కటక్ లో జరిగిన తొలి టీ20 పోరులో టీమిండియా 101 పరుగుల భారీ తేడాతో సఫారీలను చిత్తు చేయడం తెలిసిందే. ఆ విజయంతో సిరీస్ లో 1-0తో ముందంజ వేసింది.
జట్ల వివరాలు
భారత జట్టు: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్య, శివమ్ దూబే, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.
దక్షిణాఫ్రికా జట్టు:
రీజా హెండ్రిక్స్, క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), ఐడెన్ మార్‌క్రమ్ (కెప్టెన్), డివాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, డొనోవాన్ ఫెరీరా, జార్జ్ లిండే, మార్కో యాన్సెన్, లుథో సిపామ్లా, లుంగి ఎంగిడి, ఒట్నీల్ బార్ట్‌మాన్.