Pragathi: ఎదిగిన కూతురుకు ఇబ్బంది కలుగుతుందేమోనని భయపడ్డా.. నటి ప్రగతి

Actress Pragathi on Trolling and Powerlifting Medals
  • పవర్‌ లిఫ్టింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నప్పుడు చాలామంది ట్రోల్‌ చేశారన్న ప్రగతి 
  • ఈ వయసులో నీకు అవసరమా అన్నారు.. జిమ్‌లో నా దుస్తులపైనా విమర్శలు గుప్పించారని ఆవేదన 
  • ‘3 రోజెస్‌’ ట్రైలర్‌ లాంఛ్‌ ఈవెంట్లో ట్రోలర్లకు గట్టిగా జవాబిచ్చిన ప్రగతి
సరదాగా ప్రారంభించిన పవర్ లిఫ్టింగ్ ఇప్పుడు పతకాలు తెచ్చిపెట్టిందని నటి ప్రగతి అన్నారు. ప్రాక్టీస్ ప్రారంభించినప్పుడు తనపై జరిగిన ట్రోలింగ్ గురించి ఆమె గుర్తు చేసుకున్నారు. ఈ వయసులో ఇది నీకు అవసరమా అని ఎద్దేవా చేశారని, జిమ్ చేస్తున్నప్పుడు తన వస్త్రధారణపైనా విమర్శలు కురిపించారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, జిమ్ కు చీర కట్టుకుని కానీ చుడీదార్ వేసుకుని కానీ వెళ్లలేమనే విషయం తెలుసుకోవాలంటూ ట్రోలర్లకు సూచించారు.

ఈ ట్రోలింగ్ చూసి తన కూతురికి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమోనని భయపడ్డానని ప్రగతి వివరించారు. ఈ మేరకు ‘3 రోజెస్’ లాంఛ్ ఈవెంట్ లో ప్రగతి మాట్లాడుతూ.. ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌ షిప్‌లో తాను సాధించిన పతకాలను ఇండస్ట్రీలోని మహిళా ఆర్టిస్టులకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు. ఇండస్ట్రీలో కొనసాగాడం ఎంత కష్టమో తనకు తెలుసని చెప్పారు. ట్రోలింగ్ ను పట్టించుకోకుండా ధైర్యంగా ముందుకు వెళ్లడం వల్లే ఈ పతకాలు సాధించగలిగానని చెప్పారు. మీరు మాకు ఏమిచ్చినా, ఇవ్వకపోయినా.. కొంచెం మర్యాద ఇవ్వండంటూ ట్రోలర్స్‌ కు ప్రగతి కౌంటర్ ఇచ్చారు.

సెట్ లోనే కన్నుమూయాలని కోరుకుంటా..
పవర్ లిఫ్టింగ్ చేస్తున్న వీడియోలు చూసి తాను ఇక సినిమాలు మానేస్తున్నానని చాలామంది భావిస్తున్నారని ప్రగతి చెప్పారు. అయితే, సినిమాలే తనకు ప్రాణమని, నటన ఎన్నటికీ మానలేనని తెలిపారు. నటించకపోతే తాను బతకలేనని, తనకు ఇంత గుర్తింపు రావడానికి కారణం సినిమానేనని చెప్పారు. తనకు తిండి పెట్టిన ఇండస్ట్రీని ఎన్నటికీ వదలబోనని ఆమె స్పష్టం చేశారు. తుదిశ్వాస వరకూ యాక్టింగ్‌ చేస్తూనే ఉంటానని, సెట్‌లోనే కన్నుమూయాలని కోరుకుంటానని ప్రగతి పేర్కొన్నారు.
Pragathi
Pragathi actress
Pragathi powerlifting
3 Roses event
Asian Open Masters Powerlifting Championship
Telugu actress
actress trolling
powerlifting medals
film industry
movie set

More Telugu News