Kalyan Chakravarthy: చాలా కాలం తరువాత సీనియర్ హీరో రీ ఎంట్రీ!

Kalyan Chakravarthy Special
  • 1980లలో హీరోగా చేసిన కల్యాణ్ చక్రవర్తి 
  • 'లంకేశ్వరుడు' తరువాత సినిమాలకు దూరం
  • 'ఛాంపియన్' సినిమాతో రీ ఎంట్రీ
  • రాజిరెడ్డిగా పవర్ఫుల్ రోల్ 
  • ఈ నెల 25న విడుదల కానున్న సినిమా

 బాలకృష్ణ స్టార్ హీరోగా దూసుకుపోతున్న సమయంలోనే నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో హీరో కల్యాణ్ చక్రవర్తి. ఎన్టీ రామారావు సోదరుడైన త్రివిక్రమరావు తనయుడే కల్యాణ్ చక్రవర్తి. కాస్త బక్క పల్చగా .. సాఫ్ట్ గా కనిపించే కల్యాణ్ చక్రవర్తి, 1980లలో హీరోగా .. కేరక్టర్ ఆర్టిస్టుగా కొన్ని సినిమాలు చేశారు. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. ఆ జాబితాలో 'అత్తగారు స్వాగతం'.. 'అత్తగారు జిందాబాద్' .. 'ఇంటిదొంగ' .. 'తలంబ్రాలు' వంటి సినిమాలు కనిపిస్తాయి. 

చిరంజీవి కథానాయకుడిగా నటించిన 'లంకేశ్వరుడు' సినిమాలో, కల్యాణ్ చక్రవర్తి ఒక కీలకమైన పాత్రను పోషించాడు. ఆ తరువాత కొన్ని వ్యక్తిగత కారణాల వలన ఆయన సినిమాలకు దూరమయ్యారు. 2003లో వచ్చిన 'కబీర్ దాస్' సినిమాలో కాసేపు మెరిశారు. అయితే ఒక పవర్ఫుల్ పాత్రతో ఆయన ఇప్పుడు 'ఛాంపియన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఒక రకంగా  36 ఏళ్ల తరువాత ఆయన రీ ఎంట్రీగా చెప్పుకోవచ్చు.

రోషన్ - అనశ్వర రాజన్ జంటగా నటించిన ఈ సినిమాలో, 'రాజిరెడ్డి' అనే కీలకమైన పాత్రలో కల్యాణ్ చక్రవర్తి నటించారు. అప్పట్లో కల్యాణ్ చక్రవర్తి సినిమాలను చూసిన ప్రేక్షకులు ఇప్పటికీ ఆయనను మరిచిపోలేదు. వాళ్లంతా కూడా చాలా కాలం తరువాత ఆయనను చూసినందుకు హ్యాపీగా ఫీలవుతున్నారు. ఈ సినిమా తరువాత కల్యాణ్ చక్రవర్తి ఈ తరహా పాత్రలు కంటిన్యూ చేస్తారేమో చూడాలి. 

Kalyan Chakravarthy
Champion Movie
Telugu cinema
Lankeswarudu movie
Roshan
Anashwara Rajan
Rajireddy character
Nandamuri family
Telugu film industry
Comeback movie

More Telugu News