Nandamuri Balakrishna: మాస్ జపించే మంత్రం .. బాలయ్య!

Balakrishna Special
  • మాస్ ఇమేజ్ తో ఎదుగుతూ వచ్చిన బాలయ్య 
  • సినిమాల మధ్య గ్యాప్ రానీయని స్టార్
  • ఆది నుంచి అదే దూకుడు   
  • రేపు విడుదలవుతున్న 'అఖండ 2'
  • అభిమానులలో పెరుగుతున్న అంచనాలు      

బాలకృష్ణ కెరియర్ ను ఒకసారి పరిశీలన చేస్తే, ఏడాదిలో ఎక్కువ రోజులు సెట్స్ పై ఉండే హీరోగా కనిపిస్తారు. కథలు వినడం .. కరెక్షన్స్ చెప్పడం .. సెట్స్ పైకి వెళ్లిపోవడం .. ఆ సినిమాలను అదే స్పీడ్ తో థియేటర్స్ కి తీసుకురావడం మనకి కనిపిస్తుంది. ఎక్కడా నాన్చడం అలవాటు లేని హీరో ఆయన. ఇండస్ట్రీని సుదీర్ఘ కాలం పాటు ఏలుతున్న పూర్తి మాస్ హీరోగా బాలయ్యనే కనిపిస్తారు. బాలయ్య పేరుకు మించిన 'మాస్ మాత్రం' లేదనే విషయాన్ని ఆయన సినిమాల రికార్డులే చెబుతూ ఉంటాయి. 

జానపద .. పౌరాణిక కథలను టచ్ చేసి సక్సెస్ అయిన బాలయ్య, మాస్ ప్రేక్షకులను రంజింపజేయడానికే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ వెళ్లారు. సినిమాకి .. సినిమాకి మధ్య పెద్దగా గ్యాప్ ఇవ్వడం అలవాటు లేని బాలకృష్ణ, మొదటి నుంచి కూడా అదే దూకుడును కొనసాగిస్తున్నారు. అదే ఎనర్జీతో ఆయన చేసిన 'అఖండ 2' రేపు థియేటర్లలో దిగిపోనుంది. భారీ బడ్జెట్ లో .. బోయపాటి దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. కథాకథనాలు .. యాక్షన్ దృశ్యాలు .. డివోషనల్ టచ్ .. సంగీతం ఈ సినిమా హైలైట్స్ గా నిలవనున్నాయి.  

 పెద్దగా హడావిడి లేకుండా షూటింగు పూర్తి చేసుకున్న ఈ సినిమా, ఆ తరువాత నుంచి తన ప్రతాపం చూపిస్తూ వెళుతోంది. బాలయ్య అభిమానుల మధ్య ఈ సినిమానే చాలా రోజులుగా చర్చనీయంశమైపోయింది. ఓపెనింగ్స్ మొదలు అనేక రికార్డులను నమోదు చేయనున్న సినిమాగా దీనిని గురించి చెప్పుకుంటున్నారు. బాలయ్య కెరియర్లోనే అత్యధిక వసూళ్లను రాబట్టగలిగే సినిమాగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అభిమానుల అంచనాలను ఈ సినిమా అందుకుంటుందేమో చూడాలి మరి.

Nandamuri Balakrishna
Balakrishna movies
Akhanda 2
Boyapati Srinu
Telugu cinema
Mass movies
Tollywood
Telugu film industry
Akhanda sequel
Telugu film openings

More Telugu News