దూసుకుపోతున్న 'ధూల్ పేట్ పోలీస్ స్టేషన్'
- ఆహాలో 'ధూల్ పేట్ పోలీస్ స్టేషన్'
- వారానికో ఎపిసోడ్ అందుబాటులోకి
- పగ ప్రతీకారాల మధ్య సాగే కథ
- ప్రధానమైన పాత్రల్లో గురు - పదినే కుమార్
'ఆహా'లో 'ధూల్ పేట్ పోలీస్ స్టేషన్' సిరీస్ ఈ నెల 5వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కి వచ్చింది. తమిళంలో నిర్మితమైన ఈ సిరీస్, తెలుగులోను దూసుకుపోతోంది. అశ్విన్ .. గురు లక్ష్మణన్ .. పదినే కుమార్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్ కి, జస్విని దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ సిరీస్ నుంచి రెండు ఎపిసోడ్స్ ను మాత్రమే వదిలారు. మిగతా ఎపిసోడ్స్ లో ప్రతి శుక్రవారం ఒకటి చొప్పున అందుబాటులోకి తీసుకుని రానున్నారు.
కథలోకి వెళితే .. 'ధూల్ పేట్'లో పాత పగలు రాజుకుంటూ ఉంటాయి. పైకి మాత్రం ఊరు చాలా ప్రశాంతంగా కనిపిస్తూ ఉంటుంది. దసరా రోజున 'ధూల్ పేట్ పోలీస్ స్టేషన్'లో ఆయుధ పూజలు చేస్తారు. ఆ స్టేషన్ లో 'మాసాని' కానిస్టేబుల్ గా పనిచేస్తూ ఉంటుంది. జరగబోయే కొన్ని సంఘటనలు ఆమెకి ముందుగా తెలుస్తూ ఉంటాయి. తమ గ్రామంలో మూడు హత్యలు జరగనున్నాయని ఆమె మిగతా పోలీసులతో చెబుతుంది.
అదే సమయంలో 'డేవిడ్' ఆ గ్రామానికి చేరుకుంటాడు .. ఒక లాడ్జ్ లో దిగుతాడు. అతని కదలికలు లాడ్జ్ ఓనర్ కి అనుమానాన్ని కలిగిస్తాయి. తన భర్త శంకర్ ను హత్య చేసినవారిపై పగతీర్చుకునే సమయం కోసం 'చంద్ర' ఎదురుచూస్తూ ఉంటుంది. శంకర్ ఎవరు? ఆయన నేపథ్యం ఏమిటి? చంద్ర పగబట్టింది ఎవరిపై? డేవిడ్ ఎవరు? అతని రాకతో ఆ ఊర్లో చోటుచేసుకునే పరిణామాలు ఎలాంటివి? అనేది మిగతా కథ. 'హార్ట్ బీట్' ఫస్టు సీజన్ లో సీనియర్ డాక్టర్స్ గా నటించిన గురు లక్ష్మణన్ - పదినే కుమార్ కీలకమైన పాత్రలను పోషించడం ప్రధానమైన ఆకర్షణగా నిలిచింది.