YS Jagan Mohan Reddy: జమలపూర్ణమ్మను పరామర్శించిన జగన్

YS Jagan Mohan Reddy Visits Jamalapoornamma in Vijayawada
  • విజయవాడలో పర్యటించిన జగన్
  • అనారోగ్యంతో బాధపడుతున్న జమలపూర్ణమ్మ
  • పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన జగన్
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ బుధవారం విజయవాడలో పర్యటించారు. ఇటీవల అనారోగ్యానికి గురై చికిత్స పొందిన పార్టీ సీనియర్ మహిళా నేత, ఎన్టీఆర్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్‌పర్సన్ తిప్పరమల్లి జమలపూర్ణమ్మను ఆయన పరామర్శించారు.

నగరంలోని కేదారేశ్వరపేటలో ఉన్న జమలపూర్ణమ్మ నివాసానికి వెళ్లిన జగన్, ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు ధైర్యం చెప్పారు. ఎట్టిపరిస్థితుల్లోనూ అధైర్యపడవద్దని, పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని స్థానిక పార్టీ నాయకులను ఆదేశించారు.

మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటన నేపథ్యంలో ఆ ప్రాంతంలో సందడి వాతావరణం నెలకొంది. తమ నేతను చూసేందుకు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు అక్కడికి తరలివచ్చారు.
YS Jagan Mohan Reddy
Jagan
Jamalapoornamma
Tipparamalli Jamalapoornamma
YSRCP
Vijayawada
Andhra Pradesh Politics
NTR District
Kedareswarapeta
Health Update

More Telugu News