Nandamuri Balakrishna: యూఎస్‌లో ‘అఖండ 2’ తాండవం... అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే కొత్త రికార్డులు!

Balakrishna Akhanda 2 Creates Havoc in US with Advance Bookings
  • యూఎస్‌లో రికార్డు స్థాయిలో ‘అఖండ 2’ అడ్వాన్స్ బుకింగ్స్
  • ఆరు గంటల్లోనే లక్ష డాలర్లకు పైగా వసూళ్లు
  • డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం ‘అఖండ 2’ విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తోంది. ముఖ్యంగా అమెరికాలో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఊహించని రీతిలో దూసుకుపోతున్నాయి. కేవలం ఆరు గంటల్లోనే ప్రీ-సేల్స్ ద్వారా 1 లక్షా 25 వేల డాలర్లు (సుమారు కోటి రూపాయలకు పైగా) వసూలు చేసి, తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత వేగంగా ఈ మార్కును చేరుకున్న చిత్రంగా నిలిచింది. ఈ రికార్డు బాలయ్య క్రేజ్‌కు నిదర్శనంగా నిలుస్తోంది.

డిసెంబర్ 5న విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని ఆర్థిక, న్యాయపరమైన కారణాలతో వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఈ అనూహ్య వాయిదా సినిమాపై హైప్‌ను మరింత పెంచింది. అభిమానుల్లో ఆసక్తిని రెట్టింపు చేసింది. కొత్త విడుదల తేదీగా డిసెంబర్ 12ను ఖరారు చేయగా, అమెరికాలో డిసెంబర్ 11 రాత్రే ప్రీమియర్ షోలు ప్రదర్శితం కానున్నాయి. ప్రీమియర్ షోల కోసం ప్రవేశపెట్టిన 16 డాలర్ల ప్రత్యేక ధరల వ్యూహం అద్భుతంగా పనిచేసింది. టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి.

భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తుండగా, ఆది పినిశెట్టి ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ ఆచంట, గోపి ఆచంట నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. 2డీ, 3డీ ఫార్మాట్లలో రాబోతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో #Akhanda2Thandavam హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.

Nandamuri Balakrishna
Akhanda 2
Boyapati Srinu
Telugu movie
US advance bookings
Samyuktha Menon
Adi Pinisetty
SS Thaman
14 Reels Plus

More Telugu News