ఓటీటీలో .. ఐశ్వర్య రాజేశ్ చుట్టూ తిరిగే మిస్టరీ థ్రిల్లర్!
- తమిళం నుంచి మిస్టరీ థ్రిల్లర్
- కీలకమైన పాత్రలో ఐశ్వర్య రాజేశ్
- నవంబర్ 21న రిలీజైన సినిమా
- ఈ నెల 12 నుంచి 'సన్ నెక్స్ట్'లో స్ట్రీమింగ్
తెలుగు .. తమిళ భాషల్లో ఐశ్వర్య రాజేశ్ కి మంచి క్రేజ్ ఉంది. అటు థియేటర్స్ నుంచి .. ఇటు ఓటీటీ వైపు నుంచి ఐశ్వర్య రాజేశ్ సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాంటి ఐశ్వర్య రాజేశ్ నుంచి ఇప్పుడు మరో తమిళ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. మిస్టరీ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఆ సినిమా పేరే 'థీయావర్ కులై నడుంగ'. నవంబర్ 21వ తేదీన థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది.
దినేశ్ లక్ష్మణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, 'మీరా' అనే పాత్రలో ఐశ్వర్య రాజేశ్ కనిపించనుంది. ఈ సినిమాలో ఆమె పాత్రనే కీలకం. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో సీనియర్ హీరో అర్జున్ నటించాడు. తెలుగులో ఈ సినిమా 'మఫ్టీ పోలీస్' టైటిల్ తో విడుదలైంది. అలాంటి ఈ సినిమా, ఈ నెల 12వ తేదీ నుంచి 'సన్ నెక్స్ట్'లో స్ట్రీమింగ్ కానుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది.
కథ విషయానికి వస్తే, ఓ పాప్యులర్ రైటర్ దారుణంగా హత్య చేయబడతాడు. ఆతనిని ఎవరు హత్య చేశారు? ఎందుకు చేశారు? అనే విషయాన్ని తేల్చడం కోసం పోలీస్ ఆఫీసర్ గా అర్జున్ రంగంలోకి దిగుతాడు. హత్య కేసు పరిశోధనలో ముందుకు వెళుతున్నా కొద్దీ అతనికి ఆ రైటర్ గురించి తెలిసే నిజాలు ఏమిటి? మీరా పాత్ర నేపథ్యం ఏమిటి? అనేది కథ.