Inheritance Land: వారసత్వ భూమి వందకే రిజిస్ట్రేషన్.. ప్రారంభించిన ఏపీ
- మంగళవారం నుంచే అమలులోకి వచ్చిన పథకం
- రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సాఫ్ట్ వేర్ అప్ డేట్
- రూ.10 లక్షల లోపు వారసత్వ ఆస్తులు రూ.100 కే రిజిస్ట్రేషన్
ఆంధ్రప్రదేశ్ లో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ను మరింత సులభతరం చేస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రూ.10 లక్షల లోపు విలువ గల వారసత్వ ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం ఇకపై కేవలం రూ.100 మాత్రమే వసూలు చేయనున్నారు. రాష్ట్రంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఈ మేరకు మార్పులు చేసి, సాఫ్ట్ వేర్ ను అప్ డేట్ చేశారు.
మంగళవారం నుంచి రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభించామని, కొన్నిచోట్ల రిజిస్ట్రేషన్లు జరిగాయని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. వారసత్వ ఆస్తుల విలువ రూ.10 లక్షలు దాటితే రిజిస్ట్రేషన్ కోసం రూ.1000 వసూలు చేయనున్నట్లు మంత్రి వివరించారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం కలుగుతుందని మంత్రి పేర్కొన్నారు.