Pawan Kalyan: పవన్ కల్యాణ్ వ్యక్తిత్వంపై సినీ నటి జయసుధ వ్యాఖ్యలు

Jayasudha Comments on Pawan Kalyans Personality
  • ఆయన సినిమాల్లో, రాజకీయాల్లో ఎవరికీ తలవంచలేదని వ్యాఖ్య
  • ఆయన రాజకీయాలను మధ్యలో వదిలి వెళ్లిపోలేదన్న జయసుధ
  • ఆయన సినిమాల్లో నటిస్తానంటే ఎంతైనా ఇచ్చేందుకు సినిమావాళ్లు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ప్రముఖ సినీ నటి జయసుధ ప్రశంసలు కురిపించారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, పవన్ కల్యాణ్ వ్యక్తిత్వంలో నటన ఉండదని అన్నారు. ఆయన వైఖరి ఆయనదేనని పేర్కొన్నారు. గతంలో ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా ఆయన అలాగే ఉన్నారని వెల్లడించారు. ఆయనలో ఎలాంటి మార్పు లేదని అన్నారు.

పవన్ సినిమాల్లో ఎవరికీ తలవంచలేదని జయసుధ అన్నారు. ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఎవరికీ తలొగ్గడం లేదని తెలిపారు. పవన్ కల్యాణ్‌కు ఒక ప్రత్యేక శైలి ఉందని, ఆయనకు ఒక మార్గం ఉందని, దాని ప్రకారమే ముందుకు సాగుతారని అన్నారు. లేదంటే ఆయన ఎప్పుడో మధ్యలోనే వదిలి వెళ్లిపోయేవారని అభిప్రాయపడ్డారు. ఆయన పడిన కష్టం, ఆయన వ్యక్తిత్వం ఆయనను ఈ స్థాయికి తీసుకువచ్చిందని కొనియాడారు.

రాజకీయాల్లో ఇన్ని ఒత్తిడులు ఎందుకు అని ఆయన అనుకుంటే మధ్యలోనే వదిలి వెళ్లేవారని జయసుధ అన్నారు. పవన్ కల్యాణ్ సినిమాల్లో నటిస్తే పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయని తెలిపారు. ఆయనకు ఎంతైనా ఇవ్వడానికి సినీ పరిశ్రమ సిద్ధంగా ఉందని, కానీ ఆయన అన్నింటిని వదులుకుని ప్రజల కోసం రాజకీయాల్లో కొనసాగుతున్నారని పేర్కొన్నారు.
Pawan Kalyan
Jayasudha
Janasena
Andhra Pradesh Politics
Telugu Cinema
Political journey

More Telugu News