Jakarta Fire: ఇండోనేషియాలో ఏడంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం... 17 మంది మృతి

Jakarta Fire Seventeen Dead in Indonesia Building Fire
  • గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చిన అధికారులు
  • భవనంలో చిక్కుకుపోయిన వారిని గుర్తించేందుకు ప్రయత్నం
  • మొదటి అంతస్తులో మంటలు చెలరేగి, ఆ తర్వాత పై అంతస్తులకు వ్యాపించిన మంటలు
ఇండోనేషియా రాజధాని జకార్తాలోని ఏడంతస్తుల భవనంలో సంభవించిన అగ్నిప్రమాదంలో దాదాపు 17 మంది మరణించారు. అగ్నిమాపక సిబ్బంది పలు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారని మీడియా కథనాలు తెలుపుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు వెల్లడించారు.

మంటలు అదుపులోకి వచ్చాయని, భవనం లోపల మరికొందరు బాధితులు ఉండవచ్చని, వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని సెంట్రల్ జకార్తా పోలీస్ చీఫ్ తెలిపారు. మధ్యాహ్నం సమయంలో మొదటి అంతస్తులో మంటలు చెలరేగి, ఆపై పై అంతస్తులకు వ్యాపించాయని ఆయన వెల్లడించారు.

ఆ సమయంలో కొంతమంది ఉద్యోగులు భవనంలో భోజనం చేస్తుండగా, మరికొందరు కార్యాలయం నుంచి బయటకు వెళ్లారని సమాచారం. మంటల్లో చిక్కుకుపోయిన బాధితులను సురక్షితంగా బయటకు తీసుకురావడంపై దృష్టి సారించామని అధికారులు తెలిపారు. ఈ భవనంలో టెర్రా డ్రోన్ ఇండోనేషియా కార్యాలయం ఉంది.
Jakarta Fire
Indonesia Fire
Building Fire
Jakarta Building Fire
Indonesia Building Fire

More Telugu News