Sonia Gandhi: ఓటు హక్కు వివాదంలో సోనియా గాంధీకి కోర్టు నోటీసులు

Citizenship Controversy Sonia Gandhi Faces Court Notice
  • పౌరసత్వం పొందకముందే ఓటర్ జాబితాలో సోనియా పేరు
  • తప్పుడు పత్రాలతో ఓటుహక్కు పొందారని ఆరోపణ
  • వివరణ ఇవ్వాలంటూ సోనియాకు ఢిల్లీ కోర్టు ఆదేశం
భారత పౌరసత్వం రాకముందే కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ సోనియా గాంధీ ఓటు హక్కు పొందారన్న వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సోనియా గాంధీకి ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ సెషన్స్‌ కోర్టు నోటీసులు జారీ చేసింది. సోనియా గాంధీకి ఓటు హక్కు విషయంలో దాఖలైన పిటిషన్‌ విచారణకు స్వీకరించిన కోర్టు.. వివరణ ఇవ్వాలంటూ తాజాగా సోనియాను ఆదేశించింది.

భారత పౌరసత్వం పొందడానికి మూడేళ్ల ముందే సోనియా గాంధీ ఓటరుగా నమోదు చేసుకున్నారని పిటిషనర్ ఆరోపించారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించారు. దీంతో తాజాగా సోనియా గాంధీతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన కోర్టు.. ఈ కేసు తదుపరి విచారణను వచ్చే నెల 6కు వాయిదా వేసింది.

ఏమిటీ వివాదం..
ఇటలీ పౌరురాలైన సోనియా గాంధీ భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీతో వివాహం తర్వాత భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. 1983 ఏప్రిల్ 30న ఆమె భారత పౌరసత్వాన్ని పొందారు. అంతకుముందే.. అంటే 1980 నాటికే ఢిల్లీ ఓటరు జాబితాలో సోనియా గాంధీ పేరు ఉందని పిటిషనర్, బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. భారత పౌరసత్వం పొందకముందే ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవడం ఎన్నికల చట్టాల ఉల్లంఘనేనని విమర్శిస్తున్నారు.

ఓటు హక్కు కోసం సోనియా గాంధీ నకిలీ పత్రాలు సమర్పించి ఉండొచ్చని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 1980లో సోనియా గాంధీ పేరును ఓటరు జాబితాలో చేర్చిన తర్వాత తిరిగి 1982లో తొలగించారని, ఆపై 1983 జనవరిలో తిరిగి ఓటరు జాబితాలో చేర్చారని పిటిషనర్ ఆరోపించారు.
Sonia Gandhi
Sonia Gandhi voting rights
Sonia Gandhi citizenship
Delhi court notice
Indian citizenship controversy
Rajiv Gandhi
Rouse Avenue court
BJP allegations
voter list
election laws

More Telugu News