Nivetha Pethuraj: నివేదా పేతురాజ్ పెళ్లి రద్దు? ఎంగేజ్‌మెంట్ ఫోటోలు తొలగించడంతో ఊహాగానాలు!

Nivetha Pethuraj Engagement Called Off Rumors Surface After Photo Deletion
  • మలయాళీ వ్యాపారవేత్త రాజ్ హిత్ ఇబ్రాన్‌తో నివేదా పేతురాజ్ నిశ్చితార్థం 
  • ఎంగేజ్‌మెంట్ ఫొటోలు తొలగించిన నివేదా, ఇబ్రాన్
  • ఇంకా అధికారికంగా స్పందించని నివేదా
సినీ నటి నివేదా పేతురాజ్ వివాహంపై సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఆమె నిశ్చితార్థం రద్దయిందని తెలుస్తోంది. ఈ ఏడాది ఆగస్టులో దుబాయ్‌కి చెందిన మలయాళీ వ్యాపారవేత్త రాజ్ హిత్ ఇబ్రాన్‌తో ఆమె నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని ముందుగా గోప్యంగా ఉంచి, ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అయితే, తాజాగా నివేదా, రాజ్ హిత్ ఇద్దరూ తమ సోషల్ మీడియా ఖాతాల నుంచి ఎంగేజ్‌మెంట్ ఫోటోలను తొలగించడంతో వీరి పెళ్లి రద్దయిందనే ఊహాగానాలు బలపడ్డాయి.

తెలుగులో రెండేళ్ల క్రితం 'దాస్ కా ధమ్కీ', 'బూ' వంటి చిత్రాలతో పాటు 'పరువు' అనే వెబ్ సిరీస్‌లో నటించిన నివేదా, గత కొంతకాలంగా నటనకు దూరంగా ఉంటున్నారు. వివాహ బంధంలోకి అడుగుపెట్టేందుకే ఆమె సినిమాలకు విరామం ఇచ్చారని భావించారు. ఆగస్టులో నిశ్చితార్థం జరగడంతో ఈ ఏడాది చివర్లో పెళ్లి ఉంటుందని ప్రచారం జరిగింది.

అయితే, ఉన్నట్టుండి ఇద్దరూ తమ ఫొటోలను డిలీట్ చేయడంతో వారి మధ్య బ్రేకప్ జరిగిందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఈ విషయంపై నివేదా పేతురాజ్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరోవైపు, రాజ్ హిత్ ఇబ్రాన్‌కు ఓ బిగ్‌బాస్ కంటెస్టెంట్‌తో నిశ్చితార్థం జరిగిందనే మరో వార్త కూడా ప్రచారంలో ఉంది. ఈ ఊహాగానాలపై స్పష్టత రావాలంటే నివేదా స్పందించే వరకు వేచి చూడాలి.
Nivetha Pethuraj
Nivetha Pethuraj marriage
Raj Hith Ibran
Nivetha Pethuraj engagement
Celebrity breakups
Telugu actress
Das Ka Dhamki
Paruvu web series
Engagement photos deleted
Malayali businessman

More Telugu News