Ram Charan: ఎల్లలు దాటిన రామ్ చరణ్ క్రేజ్.. ఇండియా వచ్చిన జపాన్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్

Ram Charan meets Japanese fans during Peddi movie shoot
  • అభిమానులను ఆప్యాయంగా పలకరించిన మెగాపవర్ స్టార్
  • చరణ్ సింప్లిసిటీపై సోషల్ మీడియాలో ప్రశంసలు
  • త్వరలో ఢిల్లీకి పయనం కానున్న 'పెద్ది' చిత్ర యూనిట్
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌కు జపాన్‌లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయనపై ఉన్న అభిమానంతో కొందరు జపనీస్ ఫ్యాన్స్ ఏకంగా ఇండియాకే వచ్చారు. ప్రస్తుతం 'పెద్ది' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న చరణ్, ఈ విషయం తెలుసుకుని వారిని ప్రత్యేకంగా ఆహ్వానించి సమయం గడిపారు.

తనను చూసేందుకు ఎంతో దూరం నుంచి వచ్చిన అభిమానులను చరణ్ ఎంతో ఆప్యాయంగా పలకరించారు. వారితో సరదాగా మాట్లాడటంతో పాటు ఫొటోలు కూడా దిగారు. అభిమానుల పట్ల ఆయన చూపిన ప్రేమ, గౌరవం, సింప్లిసిటీకి సంబంధించిన వీడియో నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతోంది. చరణ్ తీరుపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మరోవైపు రామ్ చరణ్ నటిస్తున్న 'పెద్ది' సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం చిత్ర యూనిట్ త్వరలోనే ఢిల్లీకి వెళ్లనుంది. అక్కడ సినిమాకు అత్యంత కీలకమైన కొన్ని యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాలను చిత్రీకరించడానికి దర్శకుడు బుచ్చిబాబు సాన భారీ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్‌ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, జగపతి బాబు, బోమన్ ఇరానీ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
Ram Charan
Ram Charan Japan fans
Peddi movie
Buchi Babu Sana
Janhvi Kapoor
AR Rahman music
RRR movie
Telugu cinema
Shivrajkumar
Sports action drama

More Telugu News