Vangalapudi Anitha: తిరుపతి ఘటనపై హోంమంత్రి అనిత సీరియస్.. దర్యాప్తు కోసం ఒడిశాకు ప్రత్యేక బృందం

Vangalapudi Anitha Serious on Tirupati Incident Special Team to Odisha
  • తిరుపతి సంస్కృత వర్సిటీ ఘటనపై స్పందించిన హోంమంత్రి అనిత
  • కేసు పురోగతిపై తిరుపతి ఎస్పీతో ఫోన్‌లో ఆరా
  • నిందితులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని స్పష్టీకరణ
తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో విద్యార్థినిపై జరిగిన లైంగిక దాడి ఘటనపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా స్పందించారు. ఈ కేసు దర్యాప్తు పురోగతిపై తిరుపతి ఎస్పీ, ఇతర పోలీసు ఉన్నతాధికారులతో ఆమె ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనలో నిందితులు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు.

ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారని హోంమంత్రి తెలిపారు. తిరుపతి ఎస్పీ స్వయంగా ఈ కేసును పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. ప్రాథమిక దర్యాప్తులో భాగంగా సాక్ష్యాధారాలు, ఇతర కీలక సమాచారం సేకరించేందుకు ఒక ప్రత్యేక పోలీసు బృందాన్ని ఒడిశాకు పంపినట్లు అనిత వెల్లడించారు.

బాధితురాలికి న్యాయం చేయడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని మంత్రి అనిత పునరుద్ఘాటించారు. మహిళల భద్రతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ఇలాంటి దారుణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఆమె హెచ్చరించారు. ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసి, బాధితురాలికి త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని పోలీసు అధికారులను హోంమంత్రి ఆదేశించారు. 
Vangalapudi Anitha
Tirupati
Andhra Pradesh Home Minister
Rashtriya Sanskrit University
Sexual Assault Case
Odisha Police Investigation
Women Safety
Crime News Andhra Pradesh
Tirupati SP
AP Police

More Telugu News