Dileep: లైంగిక దాడి కేసులో నటుడు దిలీప్ ను నిర్దోషిగా తేల్చిన కోర్టు

Dileep acquitted in actress sexual assault case
  • 2017 లో దిలీప్ పై కిడ్నాప్, లైంగిక దాడి కేసు పెట్టిన ప్రముఖ నటి
  • త్రిసూర్ నుంచి కొచ్చికి కారులో ప్రయాణిస్తుండగా ఘటన
  • ఈ కేసులో అరెస్టయిన దిలీప్.. బెయిల్ పై విడుదల
మలయాళ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ నటుడు దిలీప్ ను కోర్టు నిర్దోషిగా తేల్చింది. ఇప్పటికే బెయిల్ పై బయట ఉన్న నటుడికి ఈ తీర్పుతో ఊరట లభించింది. 2017లో దిలీప్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ప్రముఖ నటి ఫిర్యాదు చేయడం ఇండస్ట్రీని కుదిపేసింది. నటి ఫిర్యాదుతో దిలీప్ ను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆయనను జైలుకు తరలించారు. తర్వాత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన దిలీప్ బెయిల్ పై విడుదలయ్యారు. తాజాగా కేరళలోని ఎర్నాకుళం కోర్టు ఈ రోజు తీర్పును వెలువరిస్తూ దిలీప్ ను నిర్దోషిగా ప్రకటించింది.

2017 ఫిబ్రవరి 17న ప్రముఖ మలయాళ నటి త్రిసూర్ నుంచి కొచ్చికి కారులో ప్రయాణిస్తుండగా కొందరు దుండగులు ఆమె వాహనాన్ని అడ్డగించారు. కదులుతున్న కారులోనే ఆమెను రెండు గంటలపాటు లైంగికంగా వేధించారు. ఈ దాడిని వీడియో తీసి, ఆమెను అవమానించేందుకు ప్రధాన నిందితుడు 'పల్సర్' సునీల్ (పల్సర్ సునీ) ప్రయత్నించాడు. ఇందుకోసం రూ.1.5 కోట్లకు సునీల్ బృందంతో నటుడు దిలీప్ డీల్ కుదుర్చుకున్నారని ఆరోపణలు వచ్చాయి.
Dileep
Dileep actress assault case
Malayalam actress
Kerala High Court
Pulsar Suni
Malayalam film industry
sexual assault case
Ernakulam court

More Telugu News