Indraja: సక్సెస్ లేకపోతే ఎవరైనా 'జీరో'నే: నటి ఇంద్రజ

Indraja Interview
  • 90లలో వెండితెరపై వెలిగిన ఇంద్రజ 
  • ప్రస్తుతం కేరక్టర్ ఆర్టిస్టుగా బిజీ
  • ఆర్ధిక ఇబ్బందులతో పెరిగానని వెల్లడి 
  • డబ్బే ప్రధానంగా మారిపోయిందని వ్యాఖ్య

1990లలో కథానాయికగా వెండితెరపై సందడి చేసిన అందాల తార ఇంద్రజ. హీరోయిన్స్ మధ్య గట్టి పోటీ నడుస్తున్న సమయంలో ఆమె ఎంట్రీ ఇచ్చారు. తనకి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ, తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రస్తుతం ఆమె కేరక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు చేస్తూ బిజీగానే ఉన్నారు. తాజాగా 'బిగ్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. 

" నాకు ఊహ తెలిసే సమయానికే మా అమ్మ హార్టు పేషంట్. ఒకసారి అమ్మకి అత్యవసరంగా సర్జరీ చేయించవలసి వచ్చింది. నా కంటే చిన్నవాళ్లయిన చెల్లెళ్లు ఏమీ చేయలేని పరిస్థితి. అప్పటికి నేను ఒక సినిమాలో చేస్తున్నాను. వాళ్లకి పరిస్థితి చెప్పినా, నాకు ఇవ్వవలసిన డబ్బు కూడా ఇవ్వలేదు. చివరికి మా పరిస్థితికి జాలిపడి ఇద్దరు డాక్టర్లు సర్జరీ పూర్తి చేశారు. ఆ తరువాత నిదానంగా డబ్బు సర్దుబాటు చేశాము. అందువలన నన్ను ఎవరైనా సాయం అడిగితే కాదనలేను" అని అన్నారు. 

"ఇప్పుడు రోజులు మారిపోయాయి. ఎవరికైతే మంచి జరగాలని కోరుకుంటూ సాయం చేస్తున్నామో .. వాళ్ల నుంచే మనం ఎదురుదెబ్బలు తినవలసి వస్తోంది. ఇలాంటి సంఘటనల వల్లనే మనుషుల మీద మనుషులకు నమ్మకం పోతోంది .. 'మనీ' మీద ఉన్న ప్రేమ అంతకంతకూ పెరిగిపోతోంది. ఎంత గుణవంతులైనా .. ఎంత చదువుకున్నా .. ఎంత ప్రతిభ ఉన్నా డబ్బులేకపోతే 'జీరో'గానే చూస్తారు. ఇప్పుడు ఎవరైనా సరే మనతో కాదు, మన సక్సెస్ తో .. మన స్టేటస్ తో మాత్రమే మాట్లాడుతున్నారు" అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

Indraja
Indraja actress
Telugu actress Indraja
actress interview
character artist
movie success
money value
status success
big tv interview
telugu cinema

More Telugu News