Jaishankar: భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పై నోరుపారేసుకున్న పాక్!

Pakistan slams Jaishankars remarks
  • భారత విదేశాంగ మంత్రి జైశంకర్ వ్యాఖ్యలపై పాక్ ఫైర్
  • తమ సైన్యాన్ని కించపరిచేలా మాట్లాడారంటూ ఆగ్రహం
  • జాతీయ భద్రతకు సైన్యమే మూలస్తంభమని స్పష్టీకరణ
  • ఓ సదస్సులో పాక్ ఆర్మీపై జైశంకర్ విమర్శలు
భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ తీవ్రంగా స్పందించింది. తమ సైన్యంపై ఆయన చేసిన విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించింది. భారత మంత్రి వ్యాఖ్యలు తమ దేశ వ్యవస్థలను, నాయకత్వాన్ని కించపరిచేలా ఉన్నాయని ఆరోపించింది.
 
ఇటీవల ఓ జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన సదస్సులో జైశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాకిస్థాన్, ఆ దేశ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌పై ఆయనకు ప్రశ్న ఎదురైంది. దీనికి బదులిస్తూ, భారత్‌కు ఎదురవుతున్న అనేక సమస్యలకు పాక్ సైన్యమే కారణమని, దాని నిజస్వరూపం అందరికీ తెలుసని ఆయన వ్యాఖ్యానించారు.
 
ఈ వ్యాఖ్యలపై పాక్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి తాహిర్ స్పందించారు. "భారత విదేశాంగ మంత్రి వ్యాఖ్యలను మేం ఖండిస్తున్నాం. మా దేశ సైన్యంతో సహా అన్ని వ్యవస్థలు జాతీయ భద్రతకు మూలస్తంభాలు. వాటిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు" అని ఆయన పేర్కొన్నారు. తమకు పాక్ సైన్యంతోనే ఎక్కువ సమస్యలు వస్తున్నాయని భారత్ చెప్పడం సరికాదని ఆయన అన్నారు.
 
Jaishankar
S Jaishankar
Pakistan
India Pakistan relations
Asim Munir
Pakistan Army
Indian Foreign Minister
Foreign policy
Tahir
National security

More Telugu News