Chandrababu Naidu: సత్యసాయి జిల్లాలో ఆలయంలో చోరీ... తీవ్రంగా స్పందించిన సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Responds to Temple Theft in Satya Sai District
  • కదిరి గంగమ్మ ఆలయంలో 5 కిలోల వెండి చోరీ చేస్తూ పట్టుబడ్డ ఈవో
  • ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు
  • ఈవో మురళీకృష్ణను తక్షణమే సస్పెండ్ చేయాలని ఆదేశం
  • సీఎం ఆదేశాలతో ఈవోను సస్పెండ్ చేసిన దేవాదాయ శాఖ
శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ఒక దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఆలయ ఆస్తులను సంరక్షించాల్సిన ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో)యే భక్షకుడిగా మారి, గుడిలోని అమ్మవారి సొమ్మును దోచుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

వివరాల్లోకి వెళితే, కదిరి రూరల్ మండలంలోని ఎర్రదొడ్డి గంగమ్మ ఆలయంలో ఈవోగా పనిచేస్తున్న మురళీకృష్ణ, గుడిలోని సుమారు 5 కిలోల వెండి ఆభరణాలు, పట్టుచీరలు, ఇతర విలువైన వస్తువులను చోరీ చేస్తూ పట్టుబడ్డాడు. ఈ విషయాన్ని గమనించిన దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ ప్రసాద్, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మురళీకృష్ణపై కేసు నమోదు చేశారు.

ఈ ఘటన ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో ఆయన తీవ్రంగా స్పందించారు. ఈవో మురళీకృష్ణను తక్షణమే సస్పెండ్ చేయాలని, కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దేవాలయాల్లో ఇలాంటి తప్పుడు పనులకు పాల్పడితే ఎంతటివారైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, ఈవో మురళీకృష్ణను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్ కాలంలో ఆయన హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లరాదని ఆదేశాల్లో స్పష్టం చేశారు. కదిరి గ్రూప్ టెంపుల్స్ బాధ్యతలను తాత్కాలికంగా హిందూపురం దేవాదాయ శాఖకు అప్పగించారు. 
Chandrababu Naidu
Sri Satya Sai district
Kadiri
temple theft
EO Muralikrishna
Goddess ornaments stolen
Endowments Department
Andhra Pradesh news
temple officer arrested
Erradoddi Gangamma Temple

More Telugu News