Virat Kohli: సింహాద్రి అప్పన్న సేవలో విరాట్ కోహ్లీ.. ప్రత్యేక పూజలు

Virat Kohli Visits Simhachalam Temple Offers Special Prayers
  • విశాఖ సింహాచలం ఆలయాన్ని సందర్శించిన విరాట్ కోహ్లీ
  • దక్షిణాఫ్రికాతో వన్డే విజయం తర్వాత స్వామివారి దర్శనం
  • కోహ్లీకి ఘనస్వాగతం పలికిన ఆలయ అధికారులు
  • కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకుని ప్రత్యేక పూజలు
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈరోజు విశాఖపట్నంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నాడు. ఆలయానికి చేరుకున్న కోహ్లీకి దేవస్థానం అధికారులు ఘనస్వాగతం పలికి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.

ఈ సందర్భంగా కోహ్లీ గర్భాలయంలో సింహాద్రి అప్పన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించాడు. అనంతరం, ఆలయంలో విశిష్టత కలిగిన కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నాడు. దర్శనం పూర్తయ్యాక, ఆలయ అర్చకులు కోహ్లీకి వేద ఆశీర్వచనాలు అందించారు. దేవస్థానం అధికారులు కోహ్లీని సత్కరించి, స్వామివారి చిత్రపటంతో పాటు తీర్థప్రసాదాలను అందజేశారు.

కోహ్లీతో పాటు యువ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్, ఫీల్డింగ్ కోచ్ దిలీప్ కూడా స్వామివారిని దర్శించుకున్నారు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో భారత జట్టు విజయం సాధించిన నేపథ్యంలో స్వామివారిని దర్శించుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కూడా సింహాచలం ఆలయాన్ని సందర్శించిన విషయం తెలిసిందే.
Virat Kohli
Virat Kohli Simhachalam
Simhadri Appanna
Varaha Lakshmi Narasimha Swamy
Visakhapatnam Temple
India Cricket
Gautam Gambhir
Cricket News
Andhra Pradesh Temples

More Telugu News