Gautam Gambhir: ఐపీఎల్ ఓనర్‌కు గంభీర్ హెచ్చరిక .. ఎవరి పని వారు చూసుకోవాలంటూ చురకలు!

Gautam Gambhir Warns IPL Owner Stick to Your Job
  • విమర్శకులపై తీవ్రంగా స్పందించిన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్
  • ఐపీఎల్ జట్టు ఓనర్‌కు పరోక్షంగా చురకలు
  • క్రికెట్‌తో సంబంధం లేనివారు సలహాలు ఇవ్వొద్దని హితవు
  • టెస్టు ఓటమికి గిల్ గాయమే కారణమని స్పష్టీకరణ
  • శుభ్‌మన్ గిల్ టీ20 సిరీస్‌కు అందుబాటులో ఉంటాడని వెల్లడి
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఓటమి తర్వాత విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. వన్డే సిరీస్ విజయం అనంతరం ఘాటుగా స్పందించాడు. విశాఖపట్నంలో శనివారం జరిగిన చివరి వన్డేలో 9 వికెట్ల తేడాతో గెలిచి, 2-1తో సిరీస్ కైవసం చేసుకున్న తర్వాత ఆయన మీడియాతో మాట్లాడాడు. విభజన కోచింగ్ విధానం ఉండాలంటూ వ్యాఖ్యానించిన ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని పార్థ్ జిందాల్‌ను ఉద్దేశించి గంభీర్ పరోక్షంగా విమర్శలు గుప్పించాడు.

"టెస్టు సిరీస్ ఓటమికి కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయపడటమే కారణమని ఎవరూ మాట్లాడలేదు. పిచ్ గురించే అందరూ చర్చించారు. క్రికెట్‌తో సంబంధం లేని వారు కూడా అభిప్రాయాలు చెప్పారు. ఓ ఐపీఎల్ జట్టు యజమాని అయితే విభజన కోచింగ్ గురించి రాశారు. ఎవరి పని వారు చూసుకుంటే మంచిది. నేను ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోనప్పుడు, నా విషయంలోకి రావడానికి వారికి హక్కు లేదు" అని గంభీర్ అన్నాడు.

టెస్టుల్లో భారత ప్రదర్శనపై జిందాల్ సోషల్ మీడియాలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. "స్వదేశంలో ఇంత ఘోర పరాజయం చూడలేదు. టెస్టులకు ప్రత్యేక కోచ్‌ను నియమించాల్సిన సమయం వచ్చింది" అని ఆయన పోస్ట్ చేశారు.

ఈ నేపథ్యంలోనే గంభీర్ స్పందించాడు. రాబోయే టీ20 సిరీస్‌కు శుభ్‌మన్ గిల్ అందుబాటులో ఉంటాడని గంభీర్ స్పష్టం చేశాడు. "గిల్ ఆడటానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే అతడిని ఎంపిక చేశాం. జట్టులో ప్రపంచ స్థాయి ఆటగాళ్లు ఉన్నారు" అని తెలిపాడు. డిసెంబర్ 9 నుంచి కటక్‌లో దక్షిణాఫ్రికాతో భారత్ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది.
Gautam Gambhir
India vs South Africa
IND vs SA
Parth Jindal
IPL owner
Team India coach
Shubman Gill
Test series defeat
T20 series
Cricket coaching

More Telugu News