Sara Tendulkar: సారా టెండూల్కర్ వారణాసి యాత్ర.. 36 గంటల్లో ఫుల్ ఎంజాయ్!

Sara Tendulkar Varanasi Trip Full Enjoy in 36 Hours
  • తల్లి అంజలితో కలిసి వారణాసి వెళ్లిన సారా టెండూల్కర్
  • కాశీ వీధుల్లో షాపింగ్ చేసి, స్థానిక వంటకాలను రుచి చూసిన సారా
  • తన 36 గంటల యాత్ర అనుభవాలను ఫోటోల రూపంలో పంచుకున్న సచిన్ తనయ
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ ఇటీవల వారణాసిలో పర్యటించారు. తల్లి అంజలితో కలిసి ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించిన ఆమె, కాశీ వీధుల్లో కలియతిరుగుతూ షాపింగ్ చేశారు. స్థానిక వంటకాలను ఆస్వాదించారు. తన 36 గంటల యాత్రకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగా, అవి ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

తన కాశీ యాత్ర ఎన్నో మధురానుభూతులను పంచిందని సారా తెలిపారు. అక్కడి వీధుల్లో తిరుగుతూ ప్రసిద్ధి చెందిన బనారసీ చీరను కొనుగోలు చేసినట్లు చెప్పారు. అలాగే, తిరంగా బర్ఫీ, దహీ వడ వంటి స్థానిక వంటకాలతో పాటు మట్టి కప్పులో టీ తాగడం వంటివి మర్చిపోలేని అనుభవాలని పేర్కొన్నారు. ఈ పర్యటనలో భాగంగా బోటింగ్ కూడా చేసినట్లు ఆమె తన పోస్టులో వివరించారు.

సారా టెండూల్కర్ కేవలం సచిన్ కుమార్తెగానే కాకుండా, ఒక న్యూట్రిషనిస్ట్‌గా, ఫ్యాషనిస్టాగా కూడా గుర్తింపు పొందారు. ఆమెకు ప్రయాణాలంటే చాలా ఇష్టం. తరచుగా తన వెకేషన్లకు సంబంధించిన ఫోటోలు, అనుభవాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.  

   
Sara Tendulkar
Sachin Tendulkar
Varanasi
Kashi
Anjali Tendulkar
Banarasi saree
Uttar Pradesh tourism
Indian cuisine
Travel
Instagram

More Telugu News