Puri Jagannath Temple: పూరీ ఆలయానికి ఒడిశా, ఏపీ సహా వివిధ రాష్ట్రాల్లో ఎన్ని వేల ఎకరాల భూమి ఉందంటే?

Puri Jagannath Temple Has Thousands of Acres Across India
  • ఒడిశాలో 60,426 ఎకరాల భూమి ఉందని వెల్లడించిన రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి
  • ఆంధ్రప్రదేశ్ సహా ఆరు రాష్ట్రాల్లో 400 ఎకరాల భూమి ఉందని వెల్లడి
  • ఆక్రమణలో ఉన్న భూములను తిరిగి పొందేందుకు కేసులు నమోదు చేసినట్లు వెల్లడి
ఒడిశా రాష్ట్రంలోని పూరి జగన్నాథ ఆలయానికి రాష్ట్రంలో 60,426 ఎకరాల భూమి ఉండగా, మరో ఆరు రాష్ట్రాల్లో దాదాపు 400 ఎకరాల భూమి ఉందని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ శనివారం శాసనసభలో వెల్లడించారు. బీజేడీ ఎమ్మెల్యే సుదర్శన్ హరిపాల్ శాసనసభలో అడిగిన ఒక లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఈ వివరాలు తెలియజేశారు.

పూరిలోని ఈ 12వ శతాబ్దపు ఆలయాన్ని శ్రీ జగన్నాథ ఆలయ చట్టం, 1956 ప్రకారం న్యాయశాఖ నిర్వహిస్తుంది. ఒడిశాలోని 24 జిల్లాల్లో జగన్నాథుని పేరు మీద 60,426.94 ఎకరాల భూమి ఉండగా, పశ్చిమ బెంగాల్ (322.93 ఎకరాలు), మహారాష్ట్ర (28.21 ఎకరాలు), మధ్యప్రదేశ్ (25.11 ఎకరాలు), ఆంధ్రప్రదేశ్ (17.02 ఎకరాలు), ఛత్తీస్‌గఢ్ (1.7 ఎకరాలు), బీహార్ (0.27 ఎకరాలు) లతో కలుపుకుని ఇతర ఆర రాష్ట్రాలలో మరో 395.25 ఎకరాల ఆలయ భూమి ఉందని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం 38,061.792 ఎకరాలకు సంబంధించిన సవరించిన భూమి రికార్డులు పూరిలోని శ్రీ జగన్నాథ ఆలయ అధికారుల వద్ద ఉన్నాయని మంత్రి తెలిపారు. ఆలయ భూమిని అక్రమంగా ఆక్రమించుకున్నట్లు అనేక కేసులు వెలుగులోకి వచ్చాయని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో ఆక్రమణలో ఉన్న 169 ఎకరాల భూమిని తిరిగి పొందేందుకు శ్రీ జగన్నాథ ఆలయ చట్టం కింద మొత్తం 974 కేసులు నమోదు చేసినట్లు ఆయన సభకు తెలియజేశారు.
Puri Jagannath Temple
Jagannath Temple
Puri Temple Land
Odisha Temple Land
Temple Land Records

More Telugu News