Quinton de Kock: విశాఖలో డికాక్ సెంచరీ... సఫారీల జోరుకు ప్రసిద్ధ్ కళ్లెం
- భారత్‌తో మూడో వన్డేలో చెలరేగిన డికాక్
- కేవలం 89 బంతుల్లో 106 పరుగులతో శతకం
- మూడు వికెట్లతో సఫారీలను దెబ్బతీసిన ప్రసిద్ధ్ కృష్ణ
- టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్
భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ (106) అద్భుత శతకంతో కదం తొక్కాడు. అయితే, కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టిన భారత పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ (3/44) సఫారీల దూకుడుకు బ్రేకులు వేశాడు. విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ రియాన్ రికిల్టన్ (0) డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ టెంబా బవుమా (48)తో కలిసి డికాక్ ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 113 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. బవుమా నిలకడగా ఆడగా, డికాక్ తనదైన శైలిలో బౌండరీలు, సిక్సర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. కేవలం 89 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో శతకం పూర్తి చేసుకున్నాడు.
భారీ స్కోరు దిశగా వెళ్తున్న దక్షిణాఫ్రికాను ప్రసిద్ధ్ కృష్ణ దెబ్బతీశాడు. దూకుడుగా ఆడుతున్న మాథ్యూ బ్రీట్జ్కే (24), ఐడెన్ మార్‌క్రమ్ (1)లను స్వల్ప వ్యవధిలో ఔట్ చేశాడు. ఆ తర్వాత సెంచరీ హీరో డికాక్‌ను కూడా పెవిలియన్‌కు పంపించి భారత్‌కు ఊరటనిచ్చాడు. అర్షదీప్ సింగ్, రవీంద్ర జడేజా చెరో వికెట్ తీసుకున్నారు.
ప్రస్తుతం 34.2 ఓవర్లు ముగిసేసరికి దక్షిణాఫ్రికా 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. క్రీజులో డెవాల్డ్ బ్రెవిస్ (19), మార్కో జాన్సెన్ (4) ఉన్నారు.