Narayana: ఇండిగో సర్వీసుల అంతరాయం.. కేంద్ర ప్రభుత్వానికి నారాయణ కీలక సూచన

Narayana suggests central government take over Indigo services
  • ఇండిగో సర్వీసుల్లో అంతరాయంతో ప్రయాణికులు ఇబ్బందిపడుతున్నారన్న సీపీఐ నేత నారాయణ
  • ఇండిగోను కేంద్రం స్వాధీనం చేసుకోవాలని సూచన
  • ప్రభుత్వరంగ సంస్థలను కేంద్రం చంపేస్తోందని విమర్శ
ఇండిగో విమాన సర్వీసుల తీవ్ర అంతరాయంపై సీపీఐ నేత నారాయణ స్పందించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి ఆయన ఒక కీలక సూచన చేశారు. ఇండిగో సర్వీసులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని అన్నారు. గత ఐదు రోజులుగా ఇండిగో విమానాల సేవల్లో అంతరాయం కొనసాగుతున్న విషయం తెలిసిందే. శనివారం కూడా పలు విమానాశ్రయాల్లో దాదాపు 500కు పైగా దేశీయ విమానాలు రద్దయ్యాయి.

ఈ సర్వీసులలో అంతరాయం కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి కేంద్ర ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. అందుకే ఇండిగోను కేంద్రం స్వాధీనం చేసుకుని నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం నిర్వీర్యం చేస్తోందని, అందుకే ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆయన విమర్శించారు. ప్రభుత్వ రంగ విమానయానంపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.
Narayana
Indigo flights
Indigo services disruption
CPI Narayana
Flight cancellations India
Aviation sector India

More Telugu News