Pune Woman: పురుషుడిపై మహిళ అత్యాచారం.. బెదిరింపు.. కేసుపెట్టిన బాధితుడు

Pune Woman Arrested for Drugging and Raping Man
  • మహారాష్ట్రలో విచిత్ర ఘటన
  • పురుషుడిపై అత్యాచారం, బ్లాక్‌మెయిల్
  • భార్య కేసులో సాయం చేస్తానని నమ్మించిన నిందితురాలు
మహారాష్ట్రలో ఓ విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ పురుషుడికి మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడటమే కాకుండా, తనను పెళ్లి చేసుకోకుంటే రేప్ కేసు పెడతానంటూ ఓ మహిళ బెదిరించిన ఘటన పూణెలోని కోత్రుడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితురాలిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ముంధ్వా ప్రాంతానికి చెందిన 37 ఏళ్ల వ్యక్తికి, కోత్రుడ్‌కు చెందిన 38 ఏళ్ల మహిళతో పరిచయం ఏర్పడింది. తాను హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నానని ఆమె నమ్మబలికింది. బాధితుడిపై అతని భార్య పెట్టిన కేసులో న్యాయసహాయం చేస్తానని చెప్పి అతనికి దగ్గరైంది. ఈ క్రమంలో, అతనికి మత్తుమందు ఇచ్చి వేర్వేరు ప్రదేశాలకు తీసుకెళ్లి మూడుసార్లు అత్యాచారం చేసినట్లు బాధితుడు తన ఫిర్యాదులో ఆరోపించాడు.

ఆ తర్వాత, నిందితురాలు తనను వివాహం చేసుకోవాలని బాధితుడిపై ఒత్తిడి తెచ్చింది. అతను అందుకు నిరాకరించడంతో, "నన్ను పెళ్లి చేసుకో, లేదా రూ. 2 లక్షలు ఇవ్వు. లేకపోతే నీపై అత్యాచారం కేసు పెట్టి జైలుకు పంపిస్తాను" అని బెదిరించినట్లు బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Pune Woman
Pune
Maharashtra
Rape Case
Extortion
High Court Lawyer
Kothrud Police Station
Mundhwa
Molestation
Crime News

More Telugu News