కొడంగల్‌లో వినూత్న ప్రచారం.. రూ.100 బాండ్‌పై ఎన్నికల మేనిఫెస్టో
- రూ.100 బాండ్ పేపర్‌పై సర్పంచ్ అభ్యర్థి మేనిఫెస్టో విడుదల
- హామీలు అమలు చేయకపోతే నిలదీయవచ్చని స్పష్టీకరణ
- ఆడపిల్ల పుడితే, పెళ్లికి ఆర్థిక సాయం వంటి పలు హామీలు
గ్రామంలో వాటర్ ప్లాంట్ అభివృద్ధి, ఆడపిల్ల పుడితే రూ.2,500, పెళ్లి కానుకగా రూ.5,501, అకారణంగా మరణించిన కుటుంబాలకు పంచాయతీ నిధుల ద్వారా రూ.6 వేల ఆర్థిక సాయం, ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఉచిత వైద్య శిబిరం వంటి మొత్తం 12 హామీలను ఆ బాండ్ పేపర్‌పై పొందుపరిచారు. తాను సర్పంచ్‌గా గెలిచిన తర్వాత ఈ హామీలను నెరవేర్చకపోతే, గ్రామస్థులు తనను నిలదీయవచ్చని అందులో స్పష్టంగా పేర్కొన్నారు. ఇది ఆయన ప్రచారంలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.