Latvia: ఇక్కడ అద్దెకు భర్తలు లభించును!

Rent a Husband Service in Latvia Due to Male Shortage
  • లాట్వియాలో తీవ్రంగా పడిపోయిన పురుషుల సంఖ్య
  • ఇంటి పనుల కోసం 'భర్తలను' అద్దెకు తీసుకుంటున్న మహిళలు
  • ఐరోపా సగటు కంటే మూడు రెట్లు అధికంగా లింగ నిష్పత్తిలో తేడా
  • పురుషుల్లో అనారోగ్య సమస్యలు, తక్కువ ఆయుర్దాయమే కారణం
  • 'హజ్బెండ్ ఫర్ యాన్ అవర్' పేరుతో ఆన్‌లైన్‌లో ప్రత్యేక సేవలు
ప్రపంచంలోని కొన్ని దేశాల్లో నెలకొన్న పరిస్థితులు ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. ఐరోపా దేశమైన లాట్వియాలో పురుషుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో అక్కడి మహిళలు వినూత్న మార్గాలను అన్వేషిస్తున్నారు. ముఖ్యంగా ఇంటి పనుల కోసం 'భర్తలను' గంటల లెక్కన అద్దెకు తీసుకోవడం ఇప్పుడు అక్కడ కొత్త ట్రెండ్‌గా మారింది.

యూరోస్టాట్ గణాంకాల ప్రకారం లాట్వియాలో పురుషుల కంటే మహిళలు 15.5 శాతం ఎక్కువగా ఉన్నారు. ఇది యూరోపియన్ యూనియన్‌లోని ఇతర దేశాల సగటు వ్యత్యాసం కంటే మూడు రెట్లు అధికం. ముఖ్యంగా 65 ఏళ్లు పైబడిన వారిలో ప్రతి ఇద్దరు మహిళలకు ఒక పురుషుడు మాత్రమే ఉన్నాడు. ఈ మగవారి కొరత రోజువారీ జీవితంలో, కార్యాలయాల్లో స్పష్టంగా కనిపిస్తోందని స్థానిక మహిళలు చెబుతున్నారు. సరైన భాగస్వామి దొరక్క చాలామంది మహిళలు విదేశాలకు వెళ్తున్నారని మరికొందరు పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ప్లంబింగ్, కార్పెంటరీ, రిపేర్లు, పెయింటింగ్, కర్టెన్లు బిగించడం వంటి పనుల కోసం మహిళలు ప్రత్యేక ఏజెన్సీలను ఆశ్రయిస్తున్నారు. 'కొమాండా24', 'రెమోంట్‌డార్బి.ఎల్వి' వంటి సంస్థలు 'హజ్బెండ్ ఫర్ యాన్ అవర్' (గంటకు ఒక భర్త) పేరుతో ఆన్‌లైన్‌లో సేవలు అందిస్తున్నాయి. ఫోన్ చేసిన వెంటనే నిపుణులైన పురుషులు వచ్చి పనులు పూర్తి చేస్తున్నారు.

లాట్వియాలో ఈ పరిస్థితికి పురుషుల ఆయుర్దాయం తక్కువగా ఉండటమే ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పురుషుల్లో అధిక ధూమపానం (31 శాతం), అనారోగ్యకరమైన జీవనశైలి, ఊబకాయం వంటి సమస్యలు వారి ఆయుష్షును తగ్గిస్తున్నాయి. ఈ 'రెంట్ ఏ హజ్బెండ్' ట్రెండ్ కేవలం లాట్వియాకే పరిమితం కాలేదు. గతంలో యూకేలో కూడా ఓ మహిళ తన భర్తను ఇలాంటి పనుల కోసం అద్దెకు ఇస్తూ వార్తల్లో నిలిచింది.
Latvia
Latvia men shortage
Rent a Husband
European women
Komanda24
Remontdarbi lv
Husband for an hour
Latvia demographics
Low male life expectancy

More Telugu News