Chandrababu Naidu: చంద్రబాబు నన్ను ఆశీర్వదించడంతో సంతోషంగా ఉంది: తెలంగాణ మంత్రి

Chandrababu Naidu blessed me says Telangana Minister Komatireddy
  • చంద్రబాబును కలిసి తెలంగాణ గ్లోబల్ సదస్సుకు ఆహ్వానించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
  • చంద్రబాబు పాలన బాగుందని కోమటిరెడ్డి కితాబు
  • జగన్ అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలపై చర్చించాలని హితవు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తనను ఆశీర్వదించడంతో ఎంతో సంతోషం కలిగిందని తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్ వేదికగా నిర్వహించనున్న 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025'కు ఆయన చంద్రబాబును ఆహ్వానించారు. ఇరువురు దాదాపు గంటన్నర సేపు సమావేశమయ్యారు.

చంద్రబాబుతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు పాలన బాగుందని కొనియాడారు. తనకు మంచి అరకు కాఫీ ఇచ్చారని, అదే విధంగా వెంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని బహూకరించారని తెలిపారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలవడం పట్ల చంద్రబాబు తనను అభినందించారని ఆయన వెల్లడించారు.

అంతేకాకుండా, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్‌కు కోమటిరెడ్డి ఒక సూచన చేశారు. జగన్ అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలపై చర్చించాలని ఆయన సూచించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ సభకు వెళ్లి పోరాటం చేసిందని ఆయన గుర్తు చేశారు.
Chandrababu Naidu
Komatireddy Venkat Reddy
Telangana Rising Global Summit 2025

More Telugu News