Ram Mohan Naidu: ఇండిగో వ్యవహారంపై స్పందించిన రామ్మోహన్ నాయుడు

Ram Mohan Naidu Responds on Indigo Airlines Issue
  • రద్దయిన విమాన సర్వీసులు క్లియర్ అయ్యాయని వెల్లడి
  • రేపటి నుంచి విమానాశ్రయాల్లో సాధారణ కార్యకలాపాలు ప్రారంభమవుతాయన్న కేంద్ర మంత్రి
  • రద్దీ లేదా వేచి ఉండే పరిస్థితి ఉండదని ఆశిస్తున్నట్లు వెల్లడి
గత రెండు రోజులుగా రద్దయిన విమాన సర్వీసులు క్లియర్ అయ్యాయని, రేపటి నుంచి విమానాశ్రయాల్లో సాధారణ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. విమానాల రద్దు వ్యవహారం క్రమంగా కొలిక్కి వస్తోందని ఆయన అన్నారు. రద్దీ లేదా వేచి ఉండే పరిస్థితి ఉండదని ఆశిస్తున్నట్లు చెప్పారు. వెంటనే మొదలు పెట్టగలిగే అన్ని కార్యకలాపాలను ప్రారంభించాలని ఇండిగోను ఆదేశించినట్లు తెలిపారు.

ప్రస్తుత పరిస్థితి నుంచి సాధారణ స్థితికి తీసుకురావడమే తమ తక్షణ కర్తవ్యమని ఆయన వెల్లడించారు. ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ నిబంధనలు, షెడ్యూలింగ్ నెట్ వర్క్‌ను తాము నిశితంగా పరిశీలిస్తున్నామని అన్నారు. అన్ని విమానయాన సంస్థలు నిబంధనలు సరిగా పాటిస్తున్నాయో లేదో నిర్ధారిస్తామని అన్నారు.

ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడ, ఎలా తప్పు జరిగిందో తెలుసుకోవడానికి ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేశామని అన్నారు. బాధ్యులైన వారిపై తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. పిల్లలు, వృద్ధులు, పాలిచ్చే తల్లులు, వికలాంగులకు విమానయానంలో ప్రాధాన్యం ఇవ్వాలని అన్ని ఎయిర్‌‍పోర్టు, ఎయిర్‌లైన్ ఆపరేటర్లను ఆదేశించినట్లు పేర్కొన్నారు.
Ram Mohan Naidu
Indigo Airlines
Flight Cancellations
Civil Aviation Ministry
Aviation Regulations

More Telugu News