HMDA: కోకాపేట నియోపొలిస్ భూములతో హెచ్ఎండీఏకు కాసుల వర్షం
- నేడు పూర్తయిన నాలుగో విడత వేలం
- హెచ్ఎండీఏకు సమకూరిన రూ.3,862 కోట్ల ఆదాయం
- ఎకరా రూ.77.75 కోట్లు పలికిన గోల్డెన్ మైల్ స్థలం
హైదరాబాద్ శివారు ప్రాంతమైన కోకాపేటలోని నియోపొలిస్ భూముల నాల్గవ విడత వేలం ప్రక్రియ ముగిసింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) నియోపొలిస్‌లోని 15, 16, 17, 18, 19, 20 ప్లాట్‌లలోని భూములను నాలుగు విడతలుగా వేలం వేసింది. ఈ వేలం ద్వారా హెచ్ఎండీఏకు రూ.3,862 కోట్ల ఆదాయం సమకూరింది.
నియోపొలిస్ స్థలాలకు అధిక డిమాండ్ ఉండటంతో వివిధ వ్యాపార, వాణిజ్య సంస్థలు పోటీపడి భూములను దక్కించుకున్నాయి.
శుక్రవారం జరిగిన వేలంలో 1.98 ఎకరాల గోల్డెన్ మైల్ స్థలాన్ని సీఓఈయూఎస్ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఎకరాకు రూ.77.75 కోట్ల చొప్పున సొంతం చేసుకుంది. నాలుగు విడతలుగా నిర్వహించిన ఈ వేలం పాటలో హెచ్ఎండీఏ గత సంవత్సరం కంటే 87 శాతం అధికంగా ఆదాయం ఆర్జించింది.