Venkat Reddy: రూ.60 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్

Additional Collector Venkat Reddy Caught Taking Bribe in Hanmakonda
  • ప్రైవేటు పాఠశాల రెన్యువల్‌కు సంబంధించి లంచం డిమాండ్
  • పక్కా ప్రణాళికతో వెంకట్ రెడ్డిని పట్టుకున్న ఏసీబీ
  • జిల్లా ఇన్‌ఛార్జ్ డీఈవోగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న వెంకట్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో ఒక అదనపు కలెక్టర్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చిక్కారు. హన్మకొండ జిల్లా కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి రూ.60 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఒక ప్రైవేటు పాఠశాల రెన్యువల్‌ కోసం ఆయన లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం.

పాఠశాల యాజమాన్యం ఈ విషయంపై ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసింది. ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళిక ప్రకారం వెంకట్ రెడ్డితో పాటు జూనియర్ అసిస్టెంట్ మనోజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. వెంకట్ రెడ్డి హన్మకొండ జిల్లా ఇన్‌ఛార్జ్ డీఈవోగా కూడా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Venkat Reddy
Hanmakonda
Additional Collector
Telangana ACB
Bribery Case
Corruption

More Telugu News