Sonia Gandhi: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌... సోనియా గాంధీ సందేశం

Sonia Gandhi Message on Telangana Rising Global Summit
  • రాష్ట్ర అభివృద్ధిలో ఈ సదస్సు కీలక పాత్ర పోషిస్తుందని ఆశాభావం
  • కీలక ప్రాజెక్టులు, ప్రణాళికల్లో భాగస్వాములు కావాలనుకునే వారికి ఈ సదస్సు వేదిక అన్న సోనియా గాంధీ
  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సోనియా గాంధీ అభినందనలు
తెలంగాణలో జరగనున్న రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌పై కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ స్పందించారు. రాష్ట్ర అభివృద్ధిలో ఈ సమ్మిట్ కీలక పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ఆమె సందేశం పంపించారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన కీలక ప్రాజెక్టులు, ప్రణాళికల్లో భాగస్వాములు కావాలనుకునే వారికి ఈ సదస్సు వేదికగా నిలుస్తుందని అన్నారు.

అర్బన్, సెమీ అర్బన్, గ్రామీణ వ్యవసాయాభివృద్ధి ప్రాజెక్టులకు సమ ప్రాధాన్యం ఇచ్చేలా మూడంచెల వ్యూహంతో తెలంగాణ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. తెలంగాణలోని మానవ, సహజ వనరులు, ప్రజల వ్యాపార, సాంకేతిక నైపుణ్యాలు, అంతర్జాతీయ ప్రతిభ అభివృద్ధికి ఈ సదస్సు మరింత తోడ్పడుతుందని అన్నారు.

ఈ నెల 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సును నిర్వహిస్తున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సోనియా గాంధీ అభినందనలు తెలియజేశారు. రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి చేస్తున్న కృషి విజయవంతం కావాలని ఆమె ఆకాంక్షించారు.
Sonia Gandhi
Telangana Rising Global Summit
Telangana
Revanth Reddy
Congress Party

More Telugu News