Pranav Mohanlal: ఓటీటీకి వచ్చేసిన హడలెత్తించే ప్రేతాత్మ కథ!

Dies Irae Movie Update
  • ప్రణవ్ మోహన్ లాల్ హీరోగా 'డీయస్ ఈరే'
  • హారర్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన సినిమా 
  • 83 కోట్లు వసూలు చేసిన కంటెంట్ 
  • ఈ రోజు నుంచే మొదలైన స్ట్రీమింగ్ 
  • ఐదు భాషల్లో అందుబాటులో    

మలయాళంలో మోహన్ లాల్ సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు. ఆయన తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ హీరోగా ఎంట్రీ ఇచ్చి చాలా కాలమే అవుతోంది. తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఇంతవరకూ ఆయన చేరువ కాలేదనే చెప్పాలి. అయితే ఇప్పుడు ఆయన తెలుగు ఆడియన్స్ కి కూడా దగ్గరయ్యే సమయం వచ్చేసింది. ఎందుకంటే మలయాళంలో ఆయన సూపర్ హిట్ అందుకున్న ఒక సినిమా ఇప్పుడు తెలుగులోను ఓటీటీకి వచ్చేసింది. ఆ సినిమా పేరే 'డీయస్ ఈరే'. 

ప్రణవ్ మోహన్ లాల్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా, అక్టోబర్ 31వ తేదీన థియేటర్లకు వచ్చింది. రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, 6 రోజులలోనే 50 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఆ తరువాత చాలా వేగంగా 80 కోట్ల మార్క్ ను టచ్ చేసింది. ఈ ఏడాదిలో అత్యధిక వసూళ్లను రాబట్టిన మలయాళ సినిమాలలో 4వ స్థానంలో నిలిచింది. అలాంటి ఈ సినిమా ఈ రోజునే 'జియో హాట్ స్టార్' లో స్ట్రీమింగ్ కి వచ్చింది. మలయాళంతో పాటు తెలుగు .. తమిళ .. కన్నడ .. హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. 

కథ విషయానికి వస్తే, ఈ సినిమా హీరో పేరు రోహన్. శ్రీమంతుల కుటుంబానికి చెందిన యువకుడు. చాలా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంటాడు. తల్లిదండ్రులు విదేశాలకి వెళ్లడం వలన ఒంటరిగా ఉంటాడు. తన క్లాస్ మేట్ 'కణి' ఆత్మహత్య చేసుకుందని తెలిసి, ఆమె పేరెంట్స్ ను పలకరించడానికి వెళతాడు. అక్కడ ఏం జరుగుతుంది? అక్కడి నుంచి తిరిగి వచ్చిన తరువాత ఏమౌతుంది? అనేది కథ. ఓటీటీ వైపు నుంచి కూడా ఈ సినిమాకి ఒక రేంజ్ లో రెస్పాన్స్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.  

Pranav Mohanlal
DTS Eeree
Malayalam movie
OTT release
Jio Hotstar
Telugu dubbed movie
Horror thriller
Rahul Sadasivan
Malayalam cinema 2024
Box office collection

More Telugu News