Pawan Kalyan: పవన్ కల్యాణ్ మీద అందుకే ఆ వ్యాఖ్యలు చేశా: ఉండవల్లిలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
- అప్పటి పరిస్థితిని బట్టి పవన్ కల్యాణ్ మీద మాట్లాడానని వెల్లడి
- తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు చంద్రబాబును ఆహ్వానించేందుకు ఉండవల్లికి వెళ్లిన మంత్రి
- చంద్రబాబు విజన్ 2020కి ప్రతిరూపమే హైదరాబాద్ అని కితాబు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మీద తాను ఇటీవల చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. కోనసీమ పచ్చదనానికి తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందని ఇటీవల పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని, లేదంటే ఆయన సినిమాలను తెలంగాణలో ఆడనివ్వమని మండిపడ్డారు.
హైదరాబాద్‌లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించేందుకు మంత్రి కోమటిరెడ్డి ఏపీకి వెళ్లారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి ఆయన వచ్చారు.
ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ, పవన్ కల్యాణ్‌పై అప్పటి పరిస్థితుల మేరకు అలా మాట్లాడానని అన్నారు. ఇప్పుడు చంద్రబాబును ఆహ్వానించడానికి వచ్చానని వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి ఉండాలని, ఇదే స్నేహం కొనసాగాలని ఆకాంక్షించారు. చంద్రబాబు విజన్ 2020 అభివృద్ధికి ప్రతిరూపమే హైదరాబాద్ అని తెలిపారు. ఇప్పుడు చంద్రబాబు విజన్‌కు తగినట్టు అమరావతి ఫ్యూచరిస్టిక్ క్యాపిటల్‌గా అభివృద్ధి చెందుతోందని అన్నారు.