iBomma Ravi: మూడు రోజుల కస్టడీకి ఐబొమ్మ రవి.. బెయిల్ పిటిషన్‌పై సోమవారం విచారణ

iBomma Ravi Three Day Custody Granted by Court
  • పోలీసుల కస్టడీ పిటిషన్‌కు నాంపల్లి కోర్టు ఆమోదం
  • ఒక్కో కేసుకు ఒక్కో రోజు చొప్పున విచారణకు అనుమతి
  • ఒక కేసులో కస్టడీ పిటిషన్ తిరస్కరించిన కోర్టు
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఐబొమ్మ వెబ్‌సైట్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రవిని మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సైబర్ క్రైమ్ పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పు వెలువరించింది.

పోలీసులు రవిపై మొత్తం నాలుగు కేసులు నమోదు చేయగా, ఒక కేసులో కస్టడీ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. మిగిలిన మూడు కేసులకు సంబంధించి ఒక్కో కేసుకు ఒక్కో రోజు చొప్పున మూడు రోజుల పాటు విచారించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో శనివారం, సోమవారం, మంగళవారం సైబర్ క్రైమ్ పోలీసులు రవిని కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు.

ఈ కేసు విచారణలో మరిన్ని కీలక విషయాలు రాబట్టాల్సి ఉందని పోలీసులు కోర్టుకు నివేదించారు. పోలీసుల వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం కస్టడీకి అనుమతి మంజూరు చేసింది. మరోవైపు, రవి తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై వాదనలను సోమవారం వింటామని కోర్టు తెలిపింది.
iBomma Ravi
iBomma
Telugu Movies
Website Piracy
Cyber Crime
Nampally Court
Bail Petition
Movie Piracy Case

More Telugu News