Akhanda 2: బాలయ్య ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘అఖండ 2’ విడుదలకు లైన్ క్లియర్!

Akhanda 2 Nandamuri Balakrishna Movie Financial Issues Resolved
  • ఆర్థిక సమస్యలతో నిలిచిపోయిన ‘అఖండ 2’ విడుదల
  • బాలయ్య అభిమానుల్లో తీవ్ర నిరాశ
  • అడ్డంకులన్నీ క్లియర్.. మూవీ విడుదలకు మార్గం సుగమం
  • కొత్త రిలీజ్ డేట్‌పై కొనసాగుతున్న ఉత్కంఠ
నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'అఖండ 2' సినిమా విడుదల చివరి నిమిషంలో వాయిదా పడటం తీవ్ర నిరాశకు గురిచేసిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా వారికి ఊరటనిచ్చే వార్త అందింది. సినిమా విడుదలకు అడ్డంకిగా మారిన ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారమైనట్టు తెలుస్తోంది.

ఇవాళ‌ విడుదల కావాల్సిన ఈ చిత్రం ఫైనాన్స్ సమస్యల కారణంగా నిలిచిపోయిందని ప్రచారం జరిగింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. సినిమా విడుదలకు సంబంధించిన చెల్లింపులన్నీ నిర్మాతలు పూర్తిచేశారు. కేవలం ఒక క్లియరెన్స్ లెటర్ మాత్రమే రావాల్సి ఉందని, అది రాగానే సినిమా విడుదలకు మార్గం సుగమమవుతుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఈ పరిణామంతో తీవ్ర నిరాశలో ఉన్న నందమూరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం కొత్త విడుదల తేదీపై గందరగోళం నెలకొంది. ఈ రోజు రాత్రి నుంచే ప్రీమియర్లు వేసి, రేపటి నుంచి రెగ్యులర్ షోలు ప్రారంభిస్తారని కొందరు అంచనా వేస్తున్నారు. టికెటింగ్ యాప్‌లలో 6వ తేదీ నుంచి బుకింగ్స్ ఓపెన్ ఉండటం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. అయితే, మరికొందరు మాత్రం డిసెంబర్ 15న సినిమా విడుదల కావచ్చని భావిస్తున్నారు.

‘అఖండ’ మొదటి భాగం సృష్టించిన సంచలనం నేపథ్యంలో ‘అఖండ 2’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్-ఇండియా స్థాయిలో విడుదల చేస్తుండటంతో ఆసక్తి మరింత పెరిగింది. విడుదల తేదీపై నెలకొన్న ఉత్కంఠకు చిత్ర బృందం త్వరలోనే అధికారిక ప్రకటనతో తెరదించుతుందని అందరూ ఆశిస్తున్నారు.
Akhanda 2
Nandamuri Balakrishna
Balakrishna Akhanda 2
Telugu cinema release
Akhanda movie sequel
Tollywood news
Indian movies
Boyapati Srinu
Pan India movie

More Telugu News