Nara Lokesh: పల్నాడు జిల్లా రోడ్డు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి నారా లోకేశ్

Nara Lokesh deeply saddened by Palnadu road accident
  • విద్యార్థులు మృతి చెందడం బాధాకరమన్న లోకేశ్
  • ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడినట్లు వెల్లడి
  • క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం
  • మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ 
పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో విద్యార్థులు మృతి చెందడం తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
 
ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న విద్యార్థులు ఇలా దుర్మరణం చెందడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే తాను అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.
 
మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని లోకేశ్ భరోసా ఇచ్చారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
 
పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం వద్ద బైపాస్ రోడ్డులో నిన్న సాయంత్రం ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురు విద్యార్ధులు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరంతా అయ్యప్ప మాలధారణలో ఉన్నారు. మృతులు విజ్ఞాన్ కళాశాల విద్యార్థులు. 
Nara Lokesh
Palnadu road accident
Chilakaluripeta accident
Andhra Pradesh
Road accident Palnadu
Vignan college students
Ayyappa devotees
Andhra Pradesh accident
Nara Lokesh reaction
Ganapavaram accident

More Telugu News