Indian Railways: కీలక మార్పు.. తత్కాల్‌ కౌంటర్ బుకింగ్స్‌కు కూడా ఓటీపీ

Indian Railways to Introduce OTP for Tatkal Counter Bookings
  • రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల వద్ద తీసుకునే తత్కాల్ టిక్కెట్లకు వన్ టైమ్ పాస్ వర్డ్ తప్పనిసరి
  • తత్కాల్ టిక్కెట్ బుకింగ్‌లో అక్రమాలను అరికట్టేందుకు నిబంధన
  • నవంబర్ 17 నుంచి ఓటీపీ ఆధారిత తత్కాల్ బుకింగ్ విధానం ప్రయోగాత్మకంగా ప్రారంభం
తత్కాల్ టిక్కెట్లకు సంబంధించి రైల్వే శాఖ మరో మార్పునకు సిద్ధమవుతోంది. రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల వద్ద తీసుకునే తత్కాల్ టిక్కెట్లకు వన్ టైమ్ పాస్‌వర్డ్‌ను తప్పనిసరి చేయనుంది. తత్కాల్ టిక్కెట్ బుకింగ్‌లో అక్రమాలను అరికట్టేందుకు ఈ నిబంధనను అమలు చేయాలని రైల్వే శాఖ భావిస్తోంది.

రిజర్వేషన్ కౌంటర్ల వద్ద నవంబర్ 17 నుంచి ఓటీపీ ఆధారిత తత్కాల్ టిక్కెట్ బుకింగ్ విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. తొలుత కొన్ని రైళ్లతో మొదలు పెట్టి తర్వాత 52 రైళ్లకు విస్తరించింది. రాబోయే కొద్ది రోజుల్లో ఈ విధానాన్ని అన్ని రిజర్వేషన్ కార్యాలయాలకు విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు రైల్వే శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అంటే ఇకపై కౌంటర్ వద్ద రిజర్వేషన్ ఫారమ్ నింపిన తర్వాత బుకింగ్ సమయంలో మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేస్తేనే టిక్కెట్ బుక్ అవుతుంది.
Indian Railways
Tatkal tickets
IRCTC
OTP
Railway reservation
Ticket booking

More Telugu News