Ram Gopal Varma: శ్రీదేవి తొడలపై పదేళ్ల నాటి వ్యాఖ్యలు.. మళ్లీ సమర్థించుకున్న రామ్ గోపాల్ వర్మ!

Ram Gopal Varma Defends Sridevi Thighs Comments
  • స్టార్‌డమ్‌లో నటనతో పాటు వాటికీ భాగముందన్న ఆర్జీవీ 
  • ఆబ్జెక్టిఫికేషన్‌లో తప్పేమిటని వర్మ ప్రశ్న
  • అమితాబ్ ఎత్తులాగే శ్రీదేవి తొడలు కూడా ఆమె ప్యాకేజీలో భాగమన్న వ్యాఖ్య
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. దివంగత నటి శ్రీదేవి స్టార్‌డమ్ సాధించడంలో ఆమె నటనతో పాటు "థండర్ థైస్" (తొడలు) కూడా కీలక పాత్ర పోషించాయని దశాబ్దం క్రితం చేసిన వ్యాఖ్యలను ఆయన తాజాగా గట్టిగా సమర్థించుకున్నారు. ఒకరిని వస్తువులా చూడటంలో తప్పేమిటని ఆయన ప్రశ్నించారు.

ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వర్మ ఈ అంశంపై మాట్లాడారు. "ఆబ్జెక్టిఫికేషన్‌లో తప్పు లేదు. ఆమెలోని నటనతో పాటు అది కూడా ఒక ఆస్తి. శ్రీదేవి కాళ్లు సన్నగా ఉండి ఉంటే, ఆమె అంత పెద్ద స్టార్ అయ్యేవారని నేను అనుకోను. అవి ఆమె సక్సెస్ ప్యాకేజీలో ఒక భాగం. అమితాబ్ బచ్చన్ ఆరు అంగుళాలు పొట్టిగా ఉన్నా, షారుఖ్ ఖాన్ ఆరు అంగుళాలు పొడవుగా ఉన్నా వారు ఈ స్థాయికి వచ్చేవారో లేదో చెప్పలేం" అని వర్మ తన అభిప్రాయాన్ని వివరించారు.

2015లో రామ్ గోపాల్ వర్మ రాసిన 'గన్స్ అండ్ థైస్' పుస్తకంలో శ్రీదేవి గురించి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి. శ్రీదేవిని పెళ్లి చేసుకున్నందుకు ఆమె భర్త బోనీ కపూర్‌ను కూడా వర్మ విమర్శించారు. దీనిపై బోనీ కపూర్ తీవ్రంగా స్పందిస్తూ వర్మను ఓ సైకో, పిచ్చివాడని అన్నారు. అప్పట్లో కూడా వర్మ తన వ్యాఖ్యలను సమర్థిస్తూ, స్మితా పాటిల్ కంటే శ్రీదేవి పెద్ద స్టార్ కావడానికి ఆమె తొడలే కారణమని ట్వీట్ చేశారు.

అయితే, ఆ వ్యాఖ్యలను తాను చిన్న వయసులో ఆమెను చూసిన దృష్టితో సరదాగా చేశానని వర్మ తాజా ఇంటర్వ్యూలో పేర్కొనడం గమనార్హం.
Ram Gopal Varma
Sridevi
Boney Kapoor
Guns and Thighs
Bollywood
Objectification
Controversy
RGV Comments
Telugu Cinema
Celebrity

More Telugu News