Anantha Nageswaran: రూపాయి పతనంపై ఆందోళన లేదు, ఎందుకంటే: సీఈఏ అనంత నాగేశ్వరన్ కీలక వ్యాఖ్యలు

Anantha Nageswaran says no need to worry about Rupee fall
  • తొలిసారి 90 మార్కును దాటిన రూపాయి విలువ
  • ప్రభుత్వం ఆందోళన చెందడం లేదని వ్యాఖ్య
  • వచ్చే సంవత్సరం పరిస్థితి మెరుగవుతుందని ఆశాభావం
భారత కరెన్సీ రూపాయి కొద్దికాలంగా తీవ్రంగా పతనమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) వి. అనంత నాగేశ్వరన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వచ్చే ఏడాది పరిస్థితి మెరుగుపడుతుందని ఆయన అన్నారు. డాలర్ మారకంతో రూపాయి విలువ తొలిసారిగా 90 మార్కును దాటి కనిష్ఠ స్థాయికి చేరిన విషయం తెలిసిందే.

రూపాయి విలువ 90 రూపాయల మార్కును దాటినప్పటికీ ప్రభుత్వం ఆందోళన చెందడం లేదని, దీనివల్ల ద్రవ్యోల్బణం లేదా ఎగుమతులపై ఎలాంటి ప్రభావం ఉండదని ఆయన స్పష్టం చేశారు. వచ్చే సంవత్సరం పరిస్థితి మెరుగుపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) యొక్క ఎడ్జ్ సమ్మిట్ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

రూపాయి విలువ బుధవారం ఇంట్రాడేలో 90.30 వద్ద కనిష్ఠాన్ని తాకింది. ఇది మంగళవారం ముగింపుతో పోలిస్తే 34 శాతం క్షీణతను సూచిస్తుంది. ఎఫ్ఐఐ అమ్మకాలు, డాలర్‌కు కొనుగోళ్ల మద్దతు వంటి కారణాల వల్ల రూపాయి పతనం అవుతోందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కాగా, రూపాయి పతనం విషయంలో విపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి.
Anantha Nageswaran
Indian Rupee
Rupee fall
CEA
Currency depreciation
Indian economy

More Telugu News