Siddaramaiah: మళ్లీ వాచ్ వివాదంలో సిద్ధరామయ్య.. కర్ణాటక సీఎం చేతి వాచ్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
- కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చేతికి ఖరీదైన వాచ్
- ఆయన చేతికి రూ. 43 లక్షల కార్టియర్ గడియారం
- సోషలిస్టు నేతగా చెప్పుకునే సిద్ధరామయ్యపై మొదలైన విమర్శలు
- గతంలో హుబ్లో వాచ్‌తోనూ ఇలాగే వివాదంలో చిక్కుకున్న సీఎం
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరోసారి తన ఖరీదైన వాచ్ కారణంగా వార్తల్లో నిలిచారు. తనను తాను సోషలిస్టు నేతగా అభివర్ణించుకునే ఆయన, తాజాగా రూ. 43 లక్షలకు పైగా విలువైన వాచ్ ధరించి కనిపించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. గతంలో హుబ్లో వాచ్‌తో తీవ్ర వివాదంలో చిక్కుకున్న ఆయన, ఇప్పుడు మరోసారి అదే తరహా విమర్శలను ఎదుర్కొంటున్నారు.
వివరాల్లోకి వెళితే... నిన్న జరిగిన ఒక బ్రేక్‌ఫాస్ట్ సమావేశంలో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇద్దరి చేతులకు కార్టియర్ బ్రాండ్ వాచ్‌లు ఉండగా, అందరి దృష్టి సిద్ధరామయ్య ధరించిన వాచ్‌పైనే పడింది. ఆయన చేతికి ఉన్నది 'శాంటోస్ డి కార్టియర్' మోడల్ అని, దాని ధర రూ. 43 లక్షల 20 వేలు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది పూర్తిగా 18 క్యారెట్ల రోజ్ గోల్డ్‌తో తయారు చేసిన అత్యంత ఖరీదైన మోడల్.
ఇదే తరహాలో 2016లోనూ సిద్ధరామయ్య తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. అప్పట్లో ఆయన రూ. 50 నుంచి 70 లక్షల విలువైన వజ్రాలు పొదిగిన హుబ్లో వాచ్ ధరించడంపై ప్రతిపక్షాలు దుమారం రేపాయి. పేదల పక్షపాతిగా చెప్పుకునే నేత ఇంతటి ఖరీదైన వస్తువులు ఎలా వాడతారని నిలదీశాయి. ఆ సమయంలో సిద్ధరామయ్య స్పందిస్తూ.. ఆ వాచ్‌ను దుబాయ్‌లో ఉండే తన స్నేహితుడైన ఒక ఎన్నారై డాక్టర్ బహుమతిగా ఇచ్చారని, అది సెకండ్ హ్యాండ్ వాచ్ అని వివరణ ఇచ్చారు.
తాజాగా ఇప్పుడు కార్టియర్ వాచ్ వ్యవహారం బయటకు రావడంతో సిద్ధరామయ్య వ్యక్తిగత అభిరుచులు, ఆయన రాజకీయ సిద్ధాంతాలపై మరోసారి కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర చర్చ మొదలైంది.