Sonia Gandhi: పర్వతాల విషయంలో కేంద్రం కొత్త మార్పులు.. సోనియా గాంధీ తీవ్ర ఆగ్రహం

Sonia Gandhi Angered by Central Govt Changes to Aravalli Mountains
  • 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తులో ఉన్న కొండల్లో మైనింగ్‌కు అనుకూలంగా కేంద్రం మార్పులు
  • ఆరావళి భౌగోళిక స్వరూపాన్ని మార్చేలా తీసుకుంటున్న చర్యలు డెత్ వారెంట్ అని హెచ్చరిక
  • అక్రమ మైనింగ్ వల్ల ఇప్పటికే సహజ సంపద తరిగిపోతోందని ఆవేదన
ఆరావళి పర్వత శ్రేణికి సంబంధించి కేంద్ర పర్యాటక శాఖ నూతన మార్పులు తీసుకువచ్చింది. వంద మీటర్ల కంటే తక్కువ ఎత్తులో ఉన్న కొండల్లో మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు అనుమతిస్తూ ఆరావళి పర్వతాల విషయంలో సవరణలు చేసింది. దీనిపై ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ తీవ్రంగా స్పందించారు. ఆరావళి పర్వతాల భౌగోళిక స్వరూపాన్ని మార్చేలా తీసుకుంటున్న చర్యలు డెత్ వారెంట్ లాంటివని ఆమె హెచ్చరించారు.

ఈ మేరకు ఓ జాతీయ మీడియా సంస్థకు రాసిన కథనంలో ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. వాటిలోని కొన్ని అంశాలను కాంగ్రెస్ సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంది. గుజరాత్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న ఈ పర్వతాలకు దేశ చరిత్ర, భౌగోళిక స్వరూపంలో కీలక స్థానం ఉందని ఆమె అన్నారు. అక్రమ మైనింగ్ కారణంగా ఇప్పటికే వాటి సహజ సంపద తరిగిపోతుండగా, నరేంద్ర మోదీ ప్రభుత్వం వాటికి డెత్ వారెంట్ ఇచ్చిందని అన్నారు.

100 మీటర్ల కంటే తక్కువ ఎత్తులో ఉన్న కొండల్లో మైనింగ్‌కు అనుమతించడం మైనింగ్ మాఫియాకు బహిరంగ ఆహ్వానం పలుకడమేనని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యావరణం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమని అన్నారు. ఇది వన్యప్రాణుల సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ నూతన విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
Sonia Gandhi
Aravalli Mountains
Mining
Central Government
Environmental Protection

More Telugu News