India Gate: కర్తవ్య పథ్ లో కనిపించని ఇండియా గేట్.. వీడియో ఇదిగో!

India Gate Disappears in Smog at Kartavya Path Delhi
  • పొగమంచు, దానికి తోడు పొల్యూషన్ 
  • ఢిల్లీలో తీవ్రంగా పడిపోయిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్
  • జ్వరం, శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడుతున్న రాజధాని వాసులు
ఢిల్లీలోని ప్రముఖ పర్యాటక ప్రదేశం ఇండియా గేట్.. కర్తవ్య పథ్ లో ఉన్న ఈ చారిత్రక కట్టడం చుట్టూ బుధవారం ఉదయం పొగమంచు కమ్మేసింది. కర్తవ్య పథ్ ముందు నిలుచున్నప్పటికీ ఇండియా గేట్ కనిపించలేదు. దీనికి తోడు వాయు కాలుష్యం సరేసరి! దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక్కడ ఇండియా గేట్ ఉండాలి కదా ఎక్కడికి పోయిందబ్బా అని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పరిస్థితికి పొగమంచుకు తోడు, వాయు కాలుష్యం కూడా కారణమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీలో వాయు కాలుష్యం ఏ స్థాయిలో ఉందో ఈ వీడియో తెలియజేస్తోందని అంటున్నారు.

దేశ రాజధాని మొత్తం చూస్తే, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 377 గా నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో ఇది 400 పాయింట్లకు కూడా చేరిందని అధికారులు వెల్లడించారు. వాయు కాలుష్యం తీవ్రం కావడంతో ఢిల్లీ వాసులు అనారోగ్యం పాలవుతున్నారు. జ్వరం, శ్వాసకోశ సమస్యలు, తలనొప్పి, దగ్గు తదితర సమస్యలతో ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.
India Gate
Kartavya Path
Delhi
Air Quality Index
AQI
Pollution
Air Pollution
Delhi Pollution
India
Environmental Issues

More Telugu News