Samantha Ruth Prabhu: అత్తింటి ఫ్యామిలీతో స‌మంత‌.. నెట్టింట ఫొటో వైర‌ల్!

Samantha With Husband Raj Nidimoru Family Photo Goes Viral
  • దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్న నటి సమంత
  • కోయంబత్తూరు ఇషా ఆశ్రమంలో నిరాడంబరంగా పెళ్లి వేడుక
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమంత కొత్త ఫ్యామిలీ ఫొటో
  • లింగ భైరవి అమ్మవారిపై ఉన్న నమ్మకంతోనే అక్కడ వివాహం
ప్రముఖ నటి సమంత తాజాగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన విష‌యం తెలిసిందే. ప్రముఖ దర్శక-నిర్మాత రాజ్ నిడిమోరును ఆమె వివాహం చేసుకున్నారు. గత కొంతకాలంగా వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ వస్తున్న వార్తలకు తెరదించుతూ, కోయంబత్తూరులోని ఇషా ఆశ్రమంలో వీరి పెళ్లి వేడుక ఆధ్యాత్మిక వాతావరణంలో నిరాడంబరంగా జరిగింది.

పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, రాజ్ కుటుంబంతో సమంత దిగిన ఒక ఫ్యామిలీ ఫొటో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. రాజ్ సోదరి శీతల్ నిడిమోరు ఈ ఫొటోను పంచుకుంటూ, "శివుడి ఆధ్వర్యంలో ఈ పెళ్లి జరగడం ఆనందంగా ఉంది" అని పేర్కొన్నారు. దీనికి సమంత 'లవ్ యూ' అని బదులివ్వడంతో వారి కుటుంబ బంధంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సమంత క్రిస్టియన్ అయినప్పటికీ, హిందూ సంప్రదాయాలను గౌరవిస్తూ లింగ భైరవి దేవత ఆలయంలో వివాహం చేసుకోవడం విశేషం. గతంలో తాను ఎదుర్కొన్న కష్ట సమయాల్లో లింగ భైరవి అమ్మవారి దర్శనం, ధ్యానం తనకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయని సమంత బలంగా నమ్ముతారు. అందుకే తన కొత్త జీవితాన్ని అదే పవిత్ర స్థలం నుంచి ప్రారంభించాలని ఆమె నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఈ జంట ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
Samantha Ruth Prabhu
Samantha marriage
Raj Nidimoru
Samantha Raj Nidimoru wedding
Isha Ashram
Lingabhairavi Temple
Coimbatore
Sheetal Nidimoru
Samantha family photo

More Telugu News