Ram Pothineni: విడుదలైన రోజే కలెక్షన్లు కొట్టేయాలన్న ఉద్దేశం లేదు: హీరో రామ్

Ram Pothineni Reveals Fears About Andhra King Taluka Release
  • 'మసాలా' ఫలితం కారణంగా నవంబర్ రిలీజ్‌కు భయపడ్డానన్న రామ్
  • ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రానికి ఎంతగానో కనెక్ట్ అయ్యానని వెల్లడి
  • ఇది హిట్టా ఫట్టా అని ఆలోచించలేదన్న యంగ్ హీరో
  • ప్రేక్షకుల అభిప్రాయాన్నే గౌరవిస్తానంటూ వ్యాఖ్య
యంగ్ హీరో రామ్ పోతినేని తన తాజా చిత్రం 'ఆంధ్ర కింగ్ తాలూకా' విడుదల విషయంలో ఒకానొక దశలో భయపడినట్లు వెల్లడించారు. గతంలో వెంకటేశ్‌తో కలిసి తాను నటించిన 'మసాలా' సినిమా నవంబర్‌లో విడుదలై ఆశించిన విజయం సాధించలేదని, ఆ సెంటిమెంట్‌తో ఈ సినిమా నవంబర్ రిలీజ్‌కు కాస్త ఆందోళన చెందానని తెలిపారు. చిత్ర యూనిట్ నిర్వహించిన థాంక్స్ మీట్‌లో ఆయన ఈ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
 
ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ.. ఎక్కువ మంది ప్రేక్షకులు చూడాలనే ఉద్దేశంతోనే 'ఆంధ్ర కింగ్ తాలూకా' తీశామని,  కానీ కొన్ని పరిస్థితుల వల్ల అన్ సీజన్‌లో విడుదల చేయాల్సి వచ్చిందన్నారు. ఈ సినిమాకు తాను ఎంతగానో కనెక్ట్ అయ్యానని, అందుకే ఏ సినిమాకూ చేయనంత ప్రచారం చేశానని వెల్లడించారు. హీరో-అభిమాని మధ్య ఉండే అనుబంధాన్ని చూపించే చిత్రం ఇది అని వివరించారు.
 
సినిమా ఫలితంపై స్పందిస్తూ.. మిగతా సినిమాల విషయంలో హిట్టా? ఫట్టా? అని ఆలోచిస్తాం కానీ ఈ సినిమా విషయంలో ఇది మంచి సినిమా అని ప్రేక్షకులు వెంటనే గుర్తిస్తారా లేక ఆలస్యంగా గుర్తిస్తారా అనేదే తమ ఆలోచన అని అన్నారు. విడుదల రోజే కలెక్షన్ల రికార్డులు కొట్టాలన్న ఉద్దేశం తమకు లేదని, ప్రేక్షకుల అభిప్రాయాన్ని తాను గౌరవిస్తానని అన్నారు. ప్రేక్షకులకు నచ్చకపోతే ఆ విషయాన్ని అక్కడితో వదిలేస్తానని రామ్ స్పష్టం చేశారు.
 
నవంబర్ 27న విడుదలైన ఈ చిత్రంలో కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్ర పోషించగా, ఆయన వీరాభిమానిగా రామ్ నటించారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే, దర్శకుడు పి. మహేశ్‌బాబు, నిర్మాత రవిశంకర్ పాల్గొన్నారు.
Ram Pothineni
Andhra King Taluka
Ram Pothineni movie
Upendra
Bhagyashri Borse
P Mahesh Babu
Telugu cinema
movie release
box office collections
hero fan relationship

More Telugu News