Telangana Government: తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.. రాజ్ భవన్ పేరు మార్పు

Telangana Government Orders Raj Bhavan Name Change to Lok Bhavan
  • వలసవాద వాసనలను తుడిచిపెట్టే ఉద్దేశంలో భాగంగా పేర్లు మార్చాలని కేంద్రం నిర్ణయం
  • లోక్ భవన్, లోక్ నివాస్‌లుగా మార్చే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర హోంశాఖ లేఖ
  • ఇప్పటికే పేర్లు మార్చిన బెంగాల్, తమిళనాడు, గుజరాత్, కేరళ, అసోం, త్రిపుర, ఒడిశా
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాజ్‌భవన్ పేరును లోక్‌భవన్‌గా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అన్ని రాజ్‌భవన్‌లను లోక్‌భవన్‌గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేసింది.

వలసవాద వాసనలను తుడిచిపెట్టే ఉద్దేశంలో భాగంగా, రాజ్‌భవన్, రాజ్‌నివాస్‌ల పేర్లను లోక్‌భవన్, లోక్‌నివాస్‌లుగా మార్చే అంశాన్ని పరిశీలించాలని గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లకు సూచిస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ లేఖ రాసింది. అందుకు అనుగుణంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు, గుజరాత్, అసోం, కేరళ, త్రిపుర, ఒడిశా తదితర రాష్ట్రాలు ఉత్తర్వులు జారీ చేశాయి.
Telangana Government
Telangana Raj Bhavan
Lok Bhavan
Name Change
Government Order

More Telugu News