Jagan Mohan Reddy: జగన్ విమాన ప్రయాణ ఖర్చులపై మంత్రి నారా లోకేశ్ స్పందన

Nara Lokesh Slams Jagan Over Flight Travel Costs
  • మాజీ సీఎం జగన్‌పై మంత్రి నారా లోకేశ్ తీవ్ర విమర్శలు
  • విమాన ప్రయాణాల కోసం రూ.222 కోట్లు ఖర్చు చేశారని ఆరోపణ
  • ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే జగన్ విలాసాలకు పోయారన్న లోకేశ్
  • ఏపీకి విజన్ బదులు వెకేషన్ ఇచ్చారంటూ ఎద్దేవా
మాజీ ముఖ్యమంత్రి జగన్ పాలనపై ఏపీ మంత్రి నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ తన విమాన ప్రయాణాల కోసం ఏకంగా రూ.222 కోట్లు ఖర్చు చేశారంటూ ఓ జాతీయ మీడియా సంస్థలో వచ్చిన కథనంపై ఆయన స్పందించారు.

దీనిపై లోకేశ్ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ప్రజలు ఉద్యోగాలు, కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, అప్పటి సీఎం జగన్ మాత్రం ప్రజాధనాన్ని దుబారా చేశారని ఆరోపించారు. రూ.500 కోట్లతో విలాసవంతమైన ప్యాలెస్ నిర్మించుకోవడంతో పాటు, రూ.222 కోట్లతో విమానాల్లో తిరిగారని విమర్శించారు.

"ఇన్నాళ్లకు అసలు నిజాలు బయటకు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు ఓ దార్శనికత (విజన్) అవసరమైతే, జగన్ మాత్రం రాష్ట్రాన్ని విహారయాత్ర (వెకేషన్)లా భావించారు" అంటూ లోకేశ్ తనదైన శైలిలో ఎద్దేవా చేశారు. 
Jagan Mohan Reddy
Nara Lokesh
Andhra Pradesh
YS Jagan
AP Politics
Jagan Flight Expenses
AP Government
TDP
YSRCP
Political News

More Telugu News