Samantha Ruth Prabhu: మొఘలుల కాలం నాటి డిజైన్ తో సమంత వెడ్డింగ్ రింగ్.. ఖరీదు ఎంతంటే..!

Samantha wedding ring features Mughal portrait cut diamond
  • షాజహాన్ భార్య ముంతాజ్ మెచ్చిన పోట్రెయిట్ కట్ ఉంగరం
  • ఈ డిజైన్ ను స్వచ్ఛమైన స్వభావానికి చిహ్నంగా భావిస్తారట
  • సమంత వెడ్డింగ్ రింగ్ విశేషాలను వెల్లడించిన జ్యువెలరీ వ్యాపారి
సమంత, రాజ్ నిడుమోరు వివాహానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫొటోలలో సమంత ధరించిన కాస్ట్యూమ్ తోపాటు ఆమె వేలికి ఉన్న వెడ్డింగ్ రింగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వెడ్డింగ్ రింగ్ ప్రత్యేకతను తాజాగా ఓ జ్యువెలరీ వ్యాపారి బయటపెట్టారు. ఈ ఉంగరానికి చాలా పెద్ద చరిత్రే ఉందని వివరించారు. మొఘలుల కాలంలో తొలిసారి ఈ రకమైన డిజైన్ తో ఉంగరం తయారుచేశారని చెప్పారు.

పోట్రెయిట్ కట్ గా పిలిచే ఈ డిజైన్ ను స్వచ్ఛమైన స్వభావానికి చిహ్నంగా భావిస్తారని తెలిపారు. మొఘల్‌ చక్రవర్తి షాజహాన్‌ భార్య ముంతాజ్‌ కు ఈ డిజైన్ ఉంగరాలంటే చాలా ఇష్టమని చరిత్రకారులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. పోట్రెయిట్ కట్ రింగ్ తయారీ కోసం వజ్రాన్ని ప్రత్యేక విధానంలో కట్‌ చేసి పలుచని గాజు పలకలా తయారుచేస్తారని జ్యువెలరీ వ్యాపారి చెప్పారు. ఈ రకమైన ఉంగరాలను అరుదుగా తయారుచేస్తారని పేర్కొన్నారు. సమంత వెడ్డింగ్ రింగ్ సుమారు రూ.1.5 కోట్లు విలువ చేస్తుందని చెప్పారు.
Samantha Ruth Prabhu
Samantha wedding ring
Samantha marriage
Raj Nidimoru
Mughal design ring
Portrait cut diamond
Diamond ring cost
Wedding jewelry
Indian wedding
Samantha jewelry

More Telugu News